Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కాళ్ళబేరం... ప్లీజ్.. యుద్ధం వద్దు.. మాట్లాడుకుందాం రండి.. నవాజ్ షరీఫ్ నోట...శాంతి మాట..!

యురీ దాడి ఘటన తర్వాత భారత్ చేసిన దౌత్య యుద్ధానికి పాకిస్థాన్ తలొగ్గింది. దీంతో పాటు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేయడంతో బెంబేలెత్తిపోయింది. దీంతో పాకిస్థాన్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:41 IST)
యురీ దాడి ఘటన తర్వాత భారత్ చేసిన దౌత్య యుద్ధానికి పాకిస్థాన్ తలొగ్గింది. దీంతో పాటు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేయడంతో బెంబేలెత్తిపోయింది. దీంతో పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది. 
 
ఇదే అంశంపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. శాంతి మంత్రం వల్లించారు. 'ఇస్లామాబాద్ శాంతిని కోరుకుంటోంది. అయితే పాకిస్థాన్‌కు ఎవరు కీడు తలపెట్టినా వారి ఆటలు సాగనీయం' అని నవాజ్‌ శుక్రవారం అన్నారు. జమ్మూకశ్మీర్, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితిని తన మంత్రివర్గ సహచరులతో సమీక్షించిన సందర్భంగా నవాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రేడియా పాకిస్థాన్ పేర్కొంది.
 
అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్న పాక్ శాంతిని కోరుకుంటోందని, అయితే మాతృభూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పాకిస్థానీ కంకణబద్ధులై ఉంటారని అన్నారు. దేశం యావత్తూ సైనిక బలగాలకు అండగా నిలుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, పేదరికం, నిరుద్యోగితపై పోరాటానికి పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నట్టు నవాజ్ తెలిపారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments