Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 కోట్లతో శ్రీకృష్ణ ఆలయం : పాకిస్థాన్ నిధులు కేటాయింపు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (13:44 IST)
శత్రుదేశం పాకిస్థాన్‌లో హిందువుల పవిత్రదైవాల్లో ఒకరైన శ్రీకృష్ణుడికి ఆలయం నిర్మితంకానుంది. ఈ ఆలయాన్ని 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ నిధులను పాకిస్థాన్ ప్రభుత్వం కేటాయించనుంది. 
 
మైనార్టీలపై తీవ్ర స్థాయిలో వివక్ష చూపించే పాకిస్థాన్... ఎట్టకేలకు ఓ మంచి పనికి ఉపక్రమించింది. ఇస్లామాబాదులో శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేసింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. 
 
ఈ సందర్భంగా పాక్ మానవహక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మాట్లాడుతూ, ఇస్లామాబాదులో హిందువుల జనాభా క్రమంగా పెరుగుతోందని... దేవాలయాలకు వెళ్లేందుకు హిందువులు ఎక్కడెక్కడకో వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. 
 
అందుకే ఇస్లామాబాదులో ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. 2017లో ఇస్లామాబాదులోని హిందూ పంచాయతీకి సీడీఏ స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. 
 
తాజాగా ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం... రూ. 10 కోట్లను విడుదల చేసిందని చెబుతూ, ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి గత బుధవారం భూమి పూజను కూడా పూర్తిచేశారు.
 
మరోవైపు, పేదరికంలో మగ్గుతున్న పాకిస్థాన్‌ను కరోనా వైరస్ మరింతగా దిగజార్చింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా హిందూ దేవాలయానికి ఆ దేశం నిధులు మంజూరు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments