Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనజీర్ భుట్టోను చంపింది వారేనట...

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఎవరు చంపారన్న విషయంపై ఓ స్పష్టత వచ్చింది. తాలిబాన్ నేత అబూ మన్సూర్ అసిమ్ ముఫ్తీ రాసిన ‘ఇంక్విలాబ్ మెహ్‌సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో బెనజీర్ హత్యకు సంబంధి

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (09:05 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఎవరు చంపారన్న విషయంపై ఓ స్పష్టత వచ్చింది. తాలిబాన్ నేత అబూ మన్సూర్ అసిమ్ ముఫ్తీ రాసిన ‘ఇంక్విలాబ్ మెహ్‌సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో బెనజీర్ హత్యకు సంబంధించి ఆసక్తికర విషయాలు రాశారు. ఆమెను చంపింది తెహ్రిక్ తాలిబన్ అనే ఉగ్ర సంస్థ అని పుస్తకంలో పేర్కొన్నారు. గతేడాది నవంబరు 30న ఈ పుస్తకాన్ని ప్రచురించగా తాజాగా ఆదివారం దీనిని విడుదల చేశారు. తాలిబన్ నేతలు చేసిన పలు అకృత్యాలను ఈ పుస్తకంలో వివరించారు.
 
మాజీ ప్రధాని భుట్టోను బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు హత్య చేసినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. తొలుత బిలాల్ మాజీ ప్రధాని మెడపై కాల్చి ఆ వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడు. ఇక్రముల్లా తప్పించుకున్నట్టు పుస్తకంలో వివరించారు. దీంతో ఇన్నాళ్లకు భుట్టో హత్యపై స్పష్టత వచ్చింది.
 
నిజానికి భుట్టోపై హత్యాయత్నం జరగబోతోందంటూ నిఘా వర్గాలు పాక్ హోంశాఖను ముందే హెచ్చరించాయి. భుట్టో, ముషారఫ్, జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లర్ రహహాన్‌ను చంపేందుకు లాడెన్ అనుచరులు ప్లాన్ చేస్తున్నట్టు హెచ్చరికలు జారీ చేశాయి. 
 
వీరి హత్యను పర్యవేక్షించేందుకు లాడెన్ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లినట్టు పేర్కొన్నాయి. లాడెన్ పేరుతో కొరియర్‌లో పేలుడు పదార్థాలు వచ్చాయని అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలను అప్పటి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఫలితంగా జరిగిన బాంబుదాడిలో భుట్టో మరణించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments