సింధు జలాల వినియోగానికి భారత్ రెండు ప్రాజెక్టులను కట్టడంపై రెండు దేశాల మధ్య ఏర్పడిన విభేదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించకుండా ప్రపంచబ్యాంకు ఆగిపోవడంతో పాకిస్థాన్ కినుకగా ఉంది. దీంతో అమెరికా మద్దత
సింధు జలాల వినియోగానికి భారత్ రెండు ప్రాజెక్టులను కట్టడంపై రెండు దేశాల మధ్య ఏర్పడిన విభేదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించకుండా ప్రపంచబ్యాంకు ఆగిపోవడంతో పాకిస్థాన్ కినుకగా ఉంది. దీంతో అమెరికా మద్దతు కోరింది. సింధు జలాల ఒప్పందం అమలు వివాదంపై జాన్ కెర్రీ గురువారం రాత్రి పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో భారత్‌లోని సింధు జలాల ఒప్పందం అమలుపై పాకిస్థాన్.. అమెరికా మద్దతు కోరింది. ఈ అంశాన్ని ఇరుదేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి జాన్‌కెర్రీ పిలుపునిచ్చారు.
మరోవైపు భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఐరాస కొత్త సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టెర్స్ పాకిస్థాన్ పత్రాలు సమర్పించనుంది. భారత్‌కు చెందిన జలాంతర్గామి సముద్ర జలాల సరిహద్దులను ఉల్లంఘించడానికి ప్రయత్నించిందని వచ్చిన ఆరోపణలపైనా ఆధారాలను సమర్పించనుంది.
ఇదిలా ఉంటే.. ఉరీ, సరిహద్దు దాడుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు మరోసారి గట్టి హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. పాక్‌కు జీవనాధారమైన సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా పాక్‌కు వదలమని స్పష్టం చేశారు.
మన దేశం నుంచి పాక్ వెళుతున్న జలాలను పూర్తిగే ఉపయోగించుకునే హక్కు ఉందని ప్రధాని తెలిపారు. సింధూ జలాలు భారత హక్కు.. కానీ, పాకిస్థాన్‌కు ఆ జలాలన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పారు. దీనిపై పాకిస్థాన్ గుర్రుగా ఉంది.