Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సింధు' ఒప్పందాన్ని గెలికితే నదుల్లో రక్తం ప్రవహిస్తుంది : హఫీజ్ సయీద్ హెచ్చరిక

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ రే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హెచ్చరిక చేశారు. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం జోలికి వస్తే రక్తపాతమే సృష్టిస్తామని హఫీజ్ సయీద్

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (15:06 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ రే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హెచ్చరిక చేశారు. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం జోలికి వస్తే రక్తపాతమే సృష్టిస్తామని హఫీజ్ సయీద్ ప్రకటించారు. 
 
కాశ్మీర్‌లోని అక్నూర్, ఉరి దాడులతో పాకిస్థానీ ముజాహిదీన్ కమాండర్లు భారత్‌కు ధీటైన జవాబిచ్చారంటూ శుక్రవారం ప్రకటించిన సయూద్... తాజాగా సింధూ జలాల ఒప్పందంపైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. లాహోర్‌కి 130 కిలోమీటర్ల దూరంలో ఫైసలాబాద్‌లో జరిగిన కాశ్మీరీ కాన్ఫరెన్స్ ర్యాలీలో సయూద్ ప్రసంగిస్తూ సింధూ జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. 
 
పాకిస్థాన్‌కు నదీ జలాలను భారత్ నిలిపివేస్తే నదుల్లో రక్తం పారుతుందంటూ హెచ్చరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉరి సైనికశిబిరంపై దాడులు జరిపిన అనంతరం సింధూ జలాల ఒప్పందంపై పున:పరిశీలన జరపాలని, సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు చట్టబద్ధంగా భారత్‌కే చెందినవని, వ్యర్థ జలాలను పాకిస్థాన్‌కు వదలకుండా నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది నవంబర్ 25న హెచ్చరించారు. దీంతో పాక్ వెన్నులో వణుకు పుట్టింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments