Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై పాకిస్థాన్ ప్రతీకార దాడికి ప్లాన్.. తాజ్‌ మహల్‌కు భద్రత పెంపు

భారత బలగాలు నిర్వహించిన సర్జికల్ దాడులకు ప్రతీకారంగా దేశంలో భారీ దాడులకు పాల్పడేలా పాకిస్థాన్ కుట్ర పన్నింది. దీంతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. పర్యాటక ప్రాంతాల్లో అదనపు సంఖ్యలో భద

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (09:54 IST)
భారత బలగాలు నిర్వహించిన సర్జికల్ దాడులకు ప్రతీకారంగా దేశంలో భారీ దాడులకు పాల్పడేలా పాకిస్థాన్ కుట్ర పన్నింది. దీంతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. పర్యాటక ప్రాంతాల్లో అదనపు సంఖ్యలో భద్రతా బలగాలను మొహరించారు. 
 
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం ఏ ఒక్కవైపు నుంచి కూడా జరగనందున ప్రతీకార దాడి అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడులను తిప్పికొట్టేందుకు భారత బలగాలు కూడా సిద్ధంగా ఉండగా, పాకిస్థాన్ ఎపుడెపుడు దాడులకు పాల్పడదామా అనే ధోరణితో ముందుకు సాగుతోంది. 
 
ముఖ్యంగా భారత సర్జికల్‌ దాడులను పాక్‌ సైన్యం, ఉగ్ర ముఠాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ పత్రీకార దాడి కొద్దిరోజుల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క శుక్రవారం ఒక్కరోజే మూడు చోట్ల ఉగ్రవాదుల చొరబాట్లను సైన్యం నిలువరించింది. 
 
ఇదిలావుండగా, ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో దేశంలో తాజ్‌మహల్‌ లాంటి పర్యటక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు అన్నింటికీ భదత్రను భారీగా పెంచారు. తాజ్‌మహల్‌ వద్ద ఏకంగా 36 మంది కమాండోలను ప్రత్యేకంగా మోహరించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో పెద్ద నగరాలన్నింటిలోనూ భద్రతను పెంచారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments