Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు ఉందంటూ బెదిరింపు.. పాకిస్థాన్ నటుడు అరెస్టు

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (17:05 IST)
విమానంలో ప్రయాణిస్తుండగా తన వద్ద బాంబు ఉందంటూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద ఆరా తీయగా ఆయన పాకిస్థాన్‌కు చెందిన నటుడని తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముహమ్మద్ ఆరిఫ్ (45) అనే వ్యక్తి ఓ పాకిస్థాన్ నటుడు. 2002లో గాయకుడు అబ్రర్‌ ఉల్‌ హక్‌కు సంబంధించిన ఒక మ్యూజిక్‌ వీడియోలో కూడా కనిపించాడు. ప్రస్తుతం అతడు నటనకు దూరంగా ఉన్నాడు. సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి కౌలాలంపుర్‌కు బయలుదేరిన విమానంలో ఆరిఫ్‌ ప్రయాణించాడు. 
 
విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి విమానాన్ని పేల్చేస్తానంటూ గట్టిగా అరుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతడి బెదిరింపులకు ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది అతడి లగేజీని తనిఖీ చేయగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసరంగా అందరినీ దించేశారు. 
 
అందులోని ప్రయాణికులను పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులను మరో విమానంలో తమ గమ్యస్థానాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ వ్యక్తి గురించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆరిష్‌ కొన్ని రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతడి న్యాయవాది తెలిపారు. అంతేకాకుండా, ఆరిఫ్‌కు యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments