Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్స్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ మత్తుమందు ఇచ్చిన రోగి.. పాక్ చెరలోని సైనికుడి పరిస్థితి?

యూరీ ఘటన అనంతరం మాటల్లో కాదని.. చేతల్లో చూపిస్తామని చెప్పి రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్ చెప్పినట్లే చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సైన్యాన్ని దింపారు. 37

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (10:30 IST)
యూరీ ఘటన అనంతరం మాటల్లో కాదని.. చేతల్లో చూపిస్తామని చెప్పి రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్ చెప్పినట్లే చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సైన్యాన్ని దింపారు. 37 మంది ఉగ్రమూకలను ఏరిపారేశారు. ఈ నేపథ్యంలో భారత సైనికులు చేపట్టిన సర్జికల్‌ స్త్రయిక్‌ తర్వాత కూడా పాకిస్థాన్‌ అనస్తీషియా (మత్తుమందు ఇచ్చిన రోగి)లోనే ఉందని రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ అన్నారు. 
 
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌చంద్రసింగ్‌ గర్వాలీ స్వగ్రామంల ఆయ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా పారికర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత దాడి చేసిన రెండు రోజుల తర్వాత కూడా ఏం జరిగిందో అర్ధం కాని నిర్వేదంలో పాక్‌ ఉందన్నారు. భారత సైన్యం హనుమంతుడి మాదిరిగా పరాక్రమించిందని కొనియాడారు.
 
మరోవైపు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన భారత సైనికుడు చందులాల్ చౌహాన్‌ను జైలులో ఖైదీలా పాకిస్థాన్ ఉంచిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యుద్ధంలో పట్టుబడిన బందీలా అతడిని నడుపుతున్నట్లు తెలిసింది. చౌహాన్‌‍ను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 
 
మహారాష్ట్రకు చెందిన చౌహాన్‌ను సరిహద్దు దాటిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాక్ చౌహాన్ తమ దగ్గరే ఉన్నట్లు ప్రకటించింది. పాక్ మీడియా చౌహాన్‌ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రసారం చేసింది. చౌహాన్ క్షేమంగా తిరిగిరావాలని దేశమంతా ఆకాంక్షిస్తోంది. అయితే పాక్ మాత్రం చౌహాన్‌ను బంధించి కొత్త నాటకానికి తెరలేపుతోందని జాతీయ మీడియా ప్రసారం చేస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments