Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిలిచ్చినా 3 నెలల పాటు పాకిస్థాన్ ప్రభుత్వ అదుపులోనే లఖ్వీ!!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (16:48 IST)
ముంబై దాడి కేసులో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ముంబై దాడి కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ మరో మూడు నెలలు జైలులోనే గడపాల్సి ఉంటుంది. లఖ్వీకి బెయిల్ మంజూరు తర్వాత భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున విమర్శలు రావడంతో మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (ఎంపీవో) కింద మూడు నెలల పాటు అతడిని నిర్బంధంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
వాస్తవానికి లఖ్వీ శుక్రవారం ఉదయం రావల్పిండి జైలు నుంచి విడుదల కావలసి ఉంది. లఖ్వీ నిర్బంధం విషయంపై పాకిస్థాన్ భారత ప్రభుత్వానికి కూడా సమాచారమందించింది. అయితే, పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన మరుసటి రోజే లఖ్వీకి బెయిల్ మంజూరు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఫలితంగా పాక్ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు నిర్బంధంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments