Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్‌కు ఎలాంటి హాని జరగలేదు.. కాఫీ తాగుతూ..

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (18:34 IST)
మనదేశం కోసం.. జీవితాన్ని అంకితమిచ్చే.. సరిహద్దుల వద్ద పోరాడే రక్షకుల పేరు చాలామంది తెలియకపోవచ్చు. అలాగే అభినందన్ అనే పైలట్ పేరు చాలామందికి బుధవారం మధ్యాహ్నం వరకు తెలియదు. కానీ ప్రస్తుతం అభినందన్ పేరు.. దేశంలోని ప్రతివారికి తెలిసిపోయింది.


అవును.. పాకిస్థాన్ విమానాలకు తరిమికొట్టే క్రమంలో అదృశ్యమైన పైలట్ అభినందన్.. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ కస్టడీలో వున్నారు. అతడు సురక్షితంగా దేశానికి తిరిగి రావాలని దేశ ప్రజలు.. ప్రార్థనలు చేస్తున్నారు. 
 
పాకిస్థాన్ విమానాలు భారత భూభాగంలోకి రాగానే పైలట్ అభినందన్‌తో కూడిన విమానం రంగంలోకి దిగింది. ఓ పాకిస్థాన్ విమానాన్ని నేలకూల్చింది. ఈ పోరాటంలో అభినందన్ అదృశ్యమయ్యారు.

ఈ పైలట్‌ను పాకిస్థాన్ ఆర్మీ అమానుషంగా దాడి చేసినట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా అభినందన్ కాఫీ కప్పు పట్టుకుని ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో మీడియాలో కనిపిస్తోంది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను దక్షిణాదికి చెందిన పైలట్ అని.. పాకిస్థాన్ తనకు గొప్ప ఆతిథ్యం ఇస్తుందని.. గౌరవించిందని.. చెప్పారు. తనకు వివాహం అయ్యిందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అభినందన్ ఆ వీడియోలో సమాధానం చెప్పారు. 

పాకిస్థాన్ ఆర్మీ బాగానే ట్రీట్ చేసిందని.. స్థానికులు కొడుతుంటే పాకిస్థాన్ ఆర్మీనే తనను కాపాడిందని.. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లో వున్నప్పుడే కాదు.. భారత్ వెళ్లినా చెప్తానని అభినందన్ ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments