Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న ఆ పవర్‌ ప్రాజెక్టులు ఆపండి: పాకిస్థాన్

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ఆపేయాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్‌లోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేశాయి. జ

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (20:01 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ఆపేయాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్‌లోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేశాయి. జమ్మూకాశ్మీర్‌లోని కిషన్‌గంగా, రాట్లేలోని హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు జీలం, చీనాబ్‌ నదులపై నిర్మిస్తున్నారు. 
 
ఆ ప్రాజెక్టులు నిలిపేయాలని తీర్మానం చేసిన విదేశీ వ్యవహారాలు కమిటీ, జల, విద్యుత్‌ కమిటీలు సింధు నదీ జలాలపై ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు మధ్యవర్తి కోర్టును ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకును కోరాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ప్రపంచ బ్యాంకు ఎలాంటి జాప్యం లేకుండా ఈ విషయంపై స్పందించాలని అడిగాయి.
 
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తి న్యాయస్థానం ఏర్పాటు చేసే వివాదం పరిష్కారం అయ్యేవరకు భారత్‌ ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రపంచబ్యాంకు ఒప్పించాలని కమిటీలు ఇచ్చిన ఉమ్మడి తీర్మానంలో పేర్కొన్నాయి. భారత్‌ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌ అన్ని దారుల్లో చర్యలకు దిగుతుందని, ఒప్పందం ఉల్లంఘనకు ఒప్పుకోబోమని పాక్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్‌ చౌదరి వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments