Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ

భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రవాద సంస్థల అగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెర

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (10:23 IST)
భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రవాద సంస్థల అగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపుదాడి జరిపిన విషయంతెల్సిందే. ఈ దాడులకు పాక్ ఆర్మీ బెంబేలెత్తి పోయింది. 
 
ముఖ్యంగా లష్కర్ ఏ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు నేతృత్వం వహిస్తున్న హఫిజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు పాక్ ఆర్మీ రక్షణ పెంచింది. స్వయంగా వారిని తమ సైనిక స్థావరాల్లో భద్రత కల్పించింది. ఫోర్ కార్ప్స్ ఆర్మీ క్యాంప్‌లో వీరికి రక్షణ కల్పించారు. 
 
భారత బలగాల మెరుపుదాడిలో లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చనిపోయారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఇద్దరు అగ్ర ఉగ్రవాద నేతలను పాక్ ఆర్మీ క్యాంపులకు మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత బలగాలు మళ్లీ కనుక మెరుపుదాడులు నిర్వహిస్తే వీరిద్దరికి ప్రాణహాని ఉంటుందని అనుమానించిన పాక్ ఆర్మీ వీరిని సురక్షిత స్థావరాలకు తరలించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments