Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్

పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (11:45 IST)
పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివున్నారని.. వీరు భారత్‌లోకి చొరబడితే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ డానియల్ కోట్స్ హెచ్చరించారు. 
 
ఇదే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత జఠిలం కానున్నాయని.. ఇంకా హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని తద్వారా భారత్ అప్రమత్తంగా ఉండాలని అమెరికా నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
గత ఏడాది జరిగిన పఠాన్ కోట్, యూరీ ఘటనలను గుర్తు చేసిన కోట్స్.. ఈ ఘటనలకు పాల్పడింది.. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులేనని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల వల్ల భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయన్నారు. తమ దేశంలోని ఉగ్ర మూలాలను ఏరిపారేయడంలో పాకిస్థాన్ తీవ్రంగా విఫలమవుతోందని.. తద్వారా ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments