Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ బ్రహ్మోస్ దెబ్బకు బంకర్లలోకి పారిపోయి దాక్కొన్న పాక్ ఆర్మీ చీఫ్ (Video)

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (08:40 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల ఉద్రిక్తలు ప్రస్తుతానికి చల్లబడ్డాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలు, ఉగ్ర శిక్షణా శిబిరాలపై భారత్ భీకర దాడులుచేసింది. ఈ దాడులకు ప్రతిగా పాకిస్థాన్ .. భారత్‌పై దాడులు చేసింది. దీంతో భారత సైనిక బలగాలు మరింతగా రెచ్చిపోయి శత్రుదేశంపై భీకర దాడులు చేసి కకావికలం చేసింది. ముఖ్యంగా, పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి చావుదెబ్బ కొట్టింది. 
 
ముఖ్యంగా, పాకిస్థాన్, రావల్పిండిలో సైనిక కేంద్ర కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్ సైనిక స్థావరంపై భారత్ వైమానికి దాడులు జరిపింది. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు ఈ స్థావరానికి అపార నష్టం వాటిల్లింది. ఈ క్షిపణి పడే సమయంలో ఆ కేంద్రంలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆ సైనిక స్థావరంలో ఉండే బంకర్లలోకి పారిపోయి దాదాపు 3 గంటల పాటు దాక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, బ్రహ్మోస్ క్షిపణి దాడి ఆగిపోయిందని తెలుసుకున్న తర్వాత తీరిగ్గా బంకర్ల నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం. 
 
బుల్లెట్ వస్తే.. బాంబు వెళ్లాల్సిందే : సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు!! 
 
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి శత్రుదేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇకపై ఏమాత్రం ఉపక్షించాల్సిన అవసరం లేదని, అటు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి బాంబు వెళ్లాలని భారత సైన్యాధిపతులకు ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ సైన్యం, వారి ప్రేరేపిత ఉగ్రమూకల కాల్పులకు ధీటైన సమాధానం ఇవ్వాలని ఆయన దేశ త్రివిధ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. తూటాకు తూటానే సమాధానం అనే రీతిలో మన ప్రతిస్పందన ఉండాలని స్పష్టం చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. 
 
ఆ వార్తా సంస్థ కథనం మేరకు.. అక్కడ నుంచి ఒక తూటా పేలితే, ఇక్కడ నుంచి బాంబు వెళ్ళాలి. సరిహద్దు నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగగబడితే భారత బలగాలు మిస్సైళ్ళతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. వారు కాల్పులు ప్రారంభిస్తే మనం రెట్టింపు స్థాయిలో కాల్పులు జరపాలి. వారు దాడి చేస్తే మనం మరింత శక్తివంతంగా ప్రతిదాడి చేయాలి అని ప్రధాని స్పష్టం చేశారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జారీచేసిన తాజా కీలక ఆదేశాలతో భారత సాయుధ బలగాలు సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికైనా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)పై భారత వైఖరి, ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు వంటి పరిణామాల పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశాన్ని ఇస్తూనే, ప్రధాని మోడీ సాయుధ బలగాల అధిపతులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments