Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సూపర్ స్పైడర్ .. ఆఫీసుకెళ్లి ఏడుగురిని చంపేశాడు..

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (17:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు మరింత కొత్తరూపాన్ని సంతరించుకుంది. ఇది గతంలో కంటే మరింత తీవ్రమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కరోనా స్ట్రెయిన్ అని పేరు పెట్టారు. అయితే, ఈ కరోనా స్ట్రెయిన్ బారినపడితే ఇక కోలుకోవడం కష్టమని వైద్య నిపుణులు పదేపదే మొత్తుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాలో ఓ వ్యక్తి సూపర్ స్పైడర్‌గా మారాడు. తనకు కరోనా సోకిందని తెలిసి కూడా ఆఫీసుకెళ్లాడు. అక్కడ మరికొందరికి ఈ వైరస్ అంటించాడు. ఈ వైరస్ బారినపడిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 కుటుంబాలు క్వారంటైన్‌కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కరోనా మహమ్మరి వ్యాప్తితో దక్షిణ ఒరెజిన్ కమ్యూనిటీలో ఏడుగురు మృతిచెందగా, వైరస్ బారిన పడ్డామనే ఆందోళనలతో వందల కుటుంబాలు క్వారంటైన్‌లోకి వెళ్లాయి. అమెరికాలో సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌లను నిర్వహించి ఓ కమ్యూనిటీ మొత్తం కరోనా బారిన పడుతుంటుంది. 
 
ఇలాంటి ఈవెంట్లు మరణాలకు కారణమవుతుంటాయి. అయితే, ఒరెజిన్ కమ్యూనిటీ మాత్రం ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు. అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆఫీస్‌కు వెళ్లడంతో సూపర్ స్ప్రెడర్‌కు కారణమైనట్లు ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 
 
తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత నిర్వహించిన టెస్టులో అతడికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఒక్కో ఉద్యోగిని ట్రేస్ చేయగా, వందల కుటుంబాలు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తేలింది. 
 
ఈ వ్యాప్తితో ఏడుగురు ప్రాణాలను కోల్పోయారని, 300 కుటుంబాలు క్వారంటై‌న్‌లో ఉన్నట్లు డౌగ్లస్ కంట్రీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం ఒరెజిన్ కమ్యూనిటీ ప్రజలు పడుతున్న బాధను మనం ఊహించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments