బంగీ జంప్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ యువతి బంగీ జంప్ కోసం వచ్చింది. అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రైనర్ చేసిన పొరపాటుతో ఆ యువతికి ఏమైందనేది తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. ఉత్సాహ
బంగీ జంప్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ యువతి బంగీ జంప్ కోసం వచ్చింది. అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రైనర్ చేసిన పొరపాటుతో ఆ యువతికి ఏమైందనేది తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. ఉత్సాహంతో బంగీ జంప్ చేయాలని వచ్చిన యువతిని ప్లాట్ ఫాంపై సిద్ధంగా ఉంచి, ఆమెను కిందకు వదిలిన తరువాత, తాను హుక్ లింక్ పెట్టడం మరిచిపోయాడు.. ట్రైనర్. అంతే షాక్ అయ్యాడు.
ఈ హృదయ విదారక ఘటన ఆ యువతి స్నేహితుడెవరో వీడియో తీయగా, ఇప్పుడది వైరల్ అయింది. ఈ ఘటన వేగ్‌లో జరిగినట్టు తెలుస్తుండగా, సదరు యువతి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇంగ్లండ్ తదితర దేశాల్లో బంగీజంప్ సర్వసాధారణం కాగా, ఎన్నో దుర్ఘటనలు కూడా జరిగాయి. బెల్ట్‌కు హుక్ వేయకుండా యువతిని జంప్ చేయిస్తున్న ట్రైనర్‌పై కేసు నమోదైందా లేదా అనేది తెలియాల్సి వుంది.