Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతావరణ కాలుష్యాన్ని గుర్తించే పనిలో గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్లు... అదెలా..?

Webdunia
గురువారం, 30 జులై 2015 (16:48 IST)
వాతావరణ కాలుష్యాన్ని గుర్తించేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. స్ట్రీట్ వ్యూ కార్లను రంగంలోకి దింపింది. వాటికి కొన్ని రకాల సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఏ సిటీలో ఏ వీధిలో ఎంత కాలుష్యం ఉందో కూడా నేరుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. 
 
గత ఏడాది నుంచి స్టార్టప్‌ అక్లిమా సంస్థతో కలిసి ఈ విషయంపై పని చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.
అమెరికాలోని డెన్వర్‌ , కొలరాడో నగరాల్లో తిరిగిన గూగుల్‌ స్ట్రీట్‌వ్యూ కార్లు వాతావరణంలో గాలి నాణ్యతకు సంబంధించి 150 మిలియన్‌ పాయింట్ల సమాచారాన్ని ఇప్పటికే రికార్డు చేశాయి. వీటిలో వూపిరితిత్తులు, శ్వాసకు హానిచేసే నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, ఓజోన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌, బ్లాక్‌ కార్బన్‌ తదితర కారకాలు ఉన్నట్లు తెలిపింది. 
 
నగరాల్లో కాలుష్యానికి సంబంధించిన సమాచారం సేకరించి అందించడం వల్ల ప్రభుత్వాలు, ప్రజలకు ఈ విషయం తెలుస్తుందని, కాలుష్య నివారణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments