Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌక బోల్తా... 13 మంది భారతీయుల గల్లంతు!!

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (14:15 IST)
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌక ఒకటి బోల్తాపడింది. ఈ ఘటనలో 13 మంది భారతీయులు గల్లంతయ్యారు. కొమొరస్ జెండాతో వెళుతున్న ఈ నౌక బోల్తాపడిన ప్రమాదంలో 13 మంది భారతీయులతో పాటు... ముగ్గురు శ్రీలంక సిబ్బంది కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే చమురు నౌక ఒకటి ఒమన్ తీరంలో ప్రమాదవశాత్తు బోల్పాడింది. నౌక మునిగిపోతున్నట్టు సముద్ర భద్రతా కేంద్రం వెల్లడించిన ఒక రోజు తర్వాత అది పూర్తిగా మునిగిపోయింది. అయితే, నౌక బోల్తా పడడం వల్ల చమురు కానీ, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు కానీ సముద్రంలో లీకవుతున్నదీ, లేనిదీ వెల్లడించలేదు.
 
నౌక యెమెనీ ఓడరేవు అడెనక్కు వెళ్తుండగా ఒమన్ ప్రధాన పారిశ్రామిక పోర్టు అయిన దుక్మలో బోల్తాపడింది. 117 మీటర్ల పొడవైన ఈ చమురు నౌకను 2007లో నిర్మించారు. ఇలాంటి చిన్నచిన్న నౌకలను తీరప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు. నౌకలోని వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments