Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పాప్ కల్చర్.. క్యాన్సర్ వ్యాధితో పోల్చిన కిమ్...?

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (14:23 IST)
ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. దక్షిణ కొరియా అధునాతన దేశంగా అభివృద్ది చెందితే, ఉత్తర కొరియా మాత్రం అందుకు విరుద్దంగా ముందుకు వెళ్తుంది. ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆ దేశంలో మొబైల్స్ చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
 
ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్‌స్టైయిల్స్ మాత్రమే యువత ఫాలో కావాలి. ఇంటర్నెట్ సౌకర్యం కుడా పెద్దగా అందుబాటులో ఉండదు. అయితే, గత కొంత కాలంగా దేశంలో దక్షిణ కొరియాకు చెందిన పాప్ కల్చర్ దిగుమతి అవుతుండటంతో యువత ఆలోచనలు క్రమంగా మారుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన కిమ్ దేశంలో పాప్ కల్చర్ పై నిషేదం విధించారు.
 
దేశంలో కే కల్చర్ ని క్యాన్సర్ వ్యాధితో పోల్చారు. కె కల్చర్ వలన వేషధారణ, హెయిర్‌స్టైయిల్‌, సంస్కృతిపై నాశనం అవుతున్నాయని వీటిని నిషేదించాలని కిమ్ చూస్తున్నారు. పాప్ కల్చర్‌తో దక్షిణకొరియాలో ఎక్కువమంది ఉపాది పొందుతున్నారు. వీరు ఎక్కువగా నార్త్ కొరియాలో ప్రదర్శనలు ఇస్తుంటారు. వీటిపై నిషేదం విధించడం వలన దక్షిణ కొరియాకు చెందిన పాప్ కల్చర్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకొవచ్చని, ఫలితంగా యువతపై పట్టు కొల్పోకుండా ఉంటామని కిమ్ ఆలోచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments