Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్‌కు వెళ్తే అందుకు ఒప్పుకోలేదట.. విడాకులు కావాలన్న కొత్త పెళ్లికొడుకు?

దుబాయ్‌కి చెందిన ఓ కొత్త జంటకు హనీమూన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. హ్యాపీగా పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన ఆ జంట తిరిగొచ్చిన రెండు రోజులకే విడాకులు కోరింది. ఇందుకు కారణం ఏంటంటే? హనీమూన్ వెళ్లిన

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (13:28 IST)
దుబాయ్‌కి చెందిన ఓ కొత్త జంటకు హనీమూన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. హ్యాపీగా పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన ఆ జంట తిరిగొచ్చిన రెండు రోజులకే విడాకులు కోరింది. ఇందుకు కారణం ఏంటంటే? హనీమూన్ వెళ్లిన సమయంలో కొత్త పెళ్లి కూతురు సెక్స్‌కు అంగీకరించకపోవడంతో కొత్త పెళ్లికొడుకు కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా కోర్టులో భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌కు చెందిన ఈ జంటకు పదిరోజుల క్రితమే వివాహం జరిగింది. యూరప్‌కు హనీమూన్‌కు వెళ్లొచ్చిన ఈ జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇందుకు కారణంగా హనీమూన్ సమయంలో భార్య సెక్స్‌‌కు సహకరించలేదని భర్త ఆరోపించాడు. అయితే భర్త ఆరోపణలను భార్య తోసిపుచ్చింది.
 
తన కోసం తన భర్త యూరప్‌లో డబ్బు ఖర్చు చేయలేదని.. తన భర్త పిసినారి అంటూ విమర్శించింది. ఇంకా తన భర్త నుంచి తనకు విడాకులు కావాలని కొత్త పెళ్లి కూతురు కూడా డిమాండ్ చేసింది. దీంతో కొత్త జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ కేసును షరియా కోర్టుకు అప్పగించారు. షరియా కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం