Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాట్లాండ్‌లో పెళ్లిలో హింస.. తల్లిపైనే వధువు దాడి.. జైలులోనే ఫస్ట్‌నైట్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (17:52 IST)
స్కాట్లాండ్‌లో ఓ జంట పెళ్లి మాత్రం హింసాత్మకంగా మారింది. పెళ్లిలో వధువు తల్లిపై దాడి జరిగింది. దాడి చేసింది కూడా వధువు కావడం విశేషం. 
 
వివరాల్లోకి వెళితే.. బాత్‌గేట్‌లోని బాలన్‌క్రిఫ్ టోల్ వద్ద ఉన్న ది వియూలో క్లారీ (26) ఎమోన్‌లు (30) పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎమోన్ మాజీ బాక్సర్. వీరిద్దరూ ఎంతో సంతోషంగా సాగాల్సిన ఈ వేడుకలో అనుకోకుండా గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
పెళ్లి కూతురే తన తల్లి లిండ్సేపై దారుణంగా దాడి చేసింది. వధువు క్లారీతో పాటు, వరుడు ఎమోన్‌ అతని సోదరుడు కీరన్ కూడా లిండ్సేపై దాడి చేశారు.  దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ గొడవలో మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
 
ఈ ఘటనపై వధూవరులపై లిండ్సే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వరుడు, వధువును, మరో వ్యక్తికి సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. దాంతో తమ మొదటి రాత్రిని జైల్లో గడిపారు. అయితే వారు జైలు నుంచి బయటకు వచ్చారు. 
 
కానీ దీనిపై కోర్టులో విచారణ సాగుతుంది. ఈ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. వారి గత నేర చరిత్రపై కూడా దర్యాప్తు సాగుతోంది. 
 
సోమవారం కోర్టుకు హాజరు కావడానికి ముందు వారు రాత్రంతా సెల్‌లలో గడిపారు. తన తల్లి జుట్టు పట్టుకుని, తలపై, శరీరంపై కొట్టి తన్నినట్లు క్లారీ పోలీసుల ఎదుట అంగీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments