Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిని వ్యభిచారంలో ఇరికించిన అక్క

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:12 IST)
ఓ అక్క తప్పు చేసి.. చెల్లిని వ్యభిచారం కేసులో ఇరికించింది. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్లోరిడాకు చెందిన జాక్లీన్ హ్యూమినీ అనే యువతికి టీచర్ కావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకోసం ఆమె తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలో ఆమె వ్యభిచారం చేస్తున్నట్టుగా పాటర్సన్ మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. వీటిని చూడగానే ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని చెల్లించింది. పైగా, తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించానో తెలియక పోయినప్పటికీ.. కేసు నుంచి విముక్తి పొందేందుకు ఆమె అపరాధం చెల్లించింది. 
 
ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఇదే తరహా నోటీసులు వచ్చాయి. దీంతో ఆమె సందేహం వచ్చి పోలీసులను  ఆశ్రయించగా అసలు విషయం వెల్లడించారు. పైగా, తాను వ్యభిచారం చేయలేదనీ, నోటీసుల్లో పేర్కొన్న సమయంలో తాను పని చేసే కార్యాలయంలో ఉన్నట్టు ఆమె రికార్డులను చూపించింది. కానీ, తాము చేయగలిగింది ఏమీ లేదని చెప్పారు. చివరకు ఆమె ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించింది. ఈ ఏజెన్సీ దర్యాప్తులో అసలు విషయం తేలింది. 
 
ఇదంతా న్యూజెర్సీలో నివశిస్తున్న తన సోదరి పనేనని, మొదటిసారి నోటీసులు వచ్చినపుడే జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని జాక్లీన్ వాపోయారు. ఎలాగైనా తనను ఈ కేసు నుంచి బయటపడేయాలని కోరారు. దీంతో ఆ సంస్థ పోలీసులను సంప్రదించింది. ఈ విషయంపై స్పందించిన వారు.. తమకు పరిస్థితి అర్థం అయ్యిందని, కానీ తామేమీ చేయలేమని చెప్పారు. ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి అవసరయ్యే సాయం చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments