Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుట్టూ మంచు పొరలు.. ఎరుపు రంగులో ఫ్లూటో.. 'నాసా' ఫోటోలు విడుదల...

Webdunia
శనివారం, 25 జులై 2015 (17:30 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' చేపట్టిన పరిశోధనలో సౌరకుటుంబంలోని చివరిదైనా ఫ్లూటో గ్రహానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఫ్లూటో గ్రహంపై గత కొంత కాలంగా పరిశోధనలు జరిపిన నాసా 'న్యూ హారిజాన్స్' అంతరిక్ష నౌక తాజాగా కలర్ ఫోటోలను విడుదల చేసింది. అందులో ఫ్లూటో ఎరుపు రంగులో ఉన్నట్టు కనిపిస్తోంది. 
 
అంతేకాకుండా ఫ్లూటో గ్రహం చుట్టూ సుమారు 160 కిలో మీటర్ల పరిధిలో మంచు పొరలు కప్పినట్లు కనిపిస్తున్నాయి. ఈ గ్రహం వాతావరణం మైనస్ 380 డిగ్రీల ఫారన్ హీటో ఉంటుందట. ఫ్లూటో గ్రహానికి 7.5 మిలియన్ మైళ్ల దూరం నుంచి న్యూ హారిజాన్స్ అంతరిక్ష నౌక తీసిన ఫోటోలను నాసా అందజేసింది. ప్లూటో చుట్టూ.. ఆ గ్రహ వాతావరణంలో 160 కిలోమీటర్ల పరిధిలో మంచు పొరలు కప్పినట్లుగా ఉంది. 
 
ప్లూటో పై నిలిచి చూస్తేమాత్రం ఈ మంచుపొరలు కన్పించబోవని జార్జి మాసన్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు తెలిపారు. అయితే ఈ మంచు పొరలు లక్షల కోట్ల సంవత్సరాలుగా ఏర్పడినవని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెబుతున్నారు. దాదాపు 45.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్లూటోపై వాతావరణం మైనస్ 380 డిగ్రీల ఫారన్ హీట్ ( మైనస్ 229 డిగ్రీల సెంటిగ్రేడ్) ఉంటుందని సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments