Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ మరణ రహస్యం : విమాన ప్రమాదంలో చనిపోయారట.. 60 యేళ్లనాటి రిపోర్టు బహిర్గతం

భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. నేతాజీ మరణ కారణాలను ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్‌సైట్ Bosefiles.info ఈ వ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (07:39 IST)
భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. నేతాజీ మరణ కారణాలను ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్‌సైట్ Bosefiles.info ఈ వివరాల్ని బయటపెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమ వద్ద ఉన్న కొన్ని విషయాలను కూడా బహిర్గతం చేసింది. కానీ, వీటిలో ఎక్కడా కూడా నేతాజీ మరణంపై స్పష్టత అనేది కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో నేతాజీ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక శుక్రవారం వెలుగుచూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో ఉంది. ఈ నివేదికను 1956లో టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి సమర్పించారని తెలిపింది. తైవాన్‌లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ... తైపీ ఆస్పత్రిలో అదే రోజు సాయంత్రం మరణించారని వెల్లడించింది. 
 
ప్రమాదం జరిగిన రోజున.. 'విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమవైపు రెక్కలోని పెటల్ విరగడంతో ఇంజిన్ ఆగిపోయింది. దాంతో విమానం అదుపుతప్పి... కింద ఉన్న కంకర రాళ్లపై పడింది. క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. మంటలు అంటుకోవడంతో బోస్ కిందకు దూకేశారు. కల్నల్ రెహమాన్, ఇతర ప్రయాణికులు నేతాజీ బట్టలు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాన్‌మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చగా... రాత్రి 7 గంటల సమయంలో మరణించారు. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు’ అని విచారణ నివేదికలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అల్లు అర్జున్ కోసం పనిచేశా, ఓజీ కోసం కొరియన్ టీమ్ తో పనిచేస్తున్నా: థమన్

Pushpa 2 Kissik Song- ఏడు కోట్లు ఆదా చేసిన శ్రీలీల.. ఎలా?

బరువెక్కుతున్న కేతిక శర్మ హృదయ అందాలు.. కుర్రాళ్లు ఫిదా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments