Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను కౌగిలించుకుని.. పదవిని పోగొట్టుకున్న మంత్రి.. ఎవరు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (09:50 IST)
అధికారాన్ని అనుభవించే రాజకీయనేతలు క్షణికావేశంలో తమ విచక్షణను కోల్పోతున్నారు. ఫలితంగా లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. మంత్రి ఒకరు తన అధికారదర్పంతో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రిపదవిని పొగొట్టుకున్న ఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. ఆ మంత్రి పేరు హరిప్రసాద్ పరాజులి. ఈయన నిర్వహిస్తూ వచ్చిన శాఖ వ్యవసాయం. 
 
సాధారణంగా ప్రతి యేడాది నేపాల్‌లో వరినాట్ల వేడుకలను వ్యవసాయశాఖ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది కూడా నేపాల్‌లో ఈ వేడుకలను నిర్వహించగా, ఈ వేడుకలకు మంత్రి హరిప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతటితో ఆగని మంత్రి... ఈ వేడుకలకు హాజరైన ఓ మహిళను కౌగిలించుకున్నారు. ఆసమయంలో అక్కడే ఉన్న మీడియా మంత్రిగారి నిర్వాకాన్ని తమ కెమెరాల్లో క్లిక్‌మనిపించింది. ఈ ఫోటోలు కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో కనిపించాయి. 
 
మహిళను కౌగిలించుకోవడం ఖచ్చితంగా లైంగిక వేధింపులేనని సామాజిక మాధ్యమాల్లో తివ్రమైన విమర్శలు వచ్చాయి. హరిప్రసాద్ వ్యవహారశైలిపై సొంత పార్టీ సీపీఎన్ - యూఎంఎల్ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయకతప్పలేదు. హరిప్రసాద్ రాజీనామాను ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లో ఆమోదించారు. పాపం.. హరిప్రసాద్. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?