Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిగ్గర్ నొక్కగానే బిన్ లాడెన్‌ తల పుచ్చకాయలా పేలిపోయింది... ‘రహస్య దాడి’పై నేవీ మాజీ సీల్‌ రాబర్ట్‌ ఓనీల్

అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదీ చీప్ బిన్ లాడెన్‌ను ఎలా మట్టుబెట్టారో నేవీ సీల్ చీఫ్ రాబర్ట్ ఇపుడు బహిర్గతం చేశాడు. ఓ చీకటి గది.. ఒక చీకటి గది.. కళ్ల ముందు టార్గెట్‌.. ట్రిగ్గర్‌ను నొక్కిన వేలు.. పుచ్చక

Webdunia
మంగళవారం, 2 మే 2017 (13:11 IST)
అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదీ చీప్ బిన్ లాడెన్‌ను ఎలా మట్టుబెట్టారో నేవీ సీల్ చీఫ్ రాబర్ట్ ఇపుడు బహిర్గతం చేశాడు. ఓ చీకటి గది.. ఒక చీకటి గది.. కళ్ల ముందు టార్గెట్‌.. ట్రిగ్గర్‌ను నొక్కిన వేలు.. పుచ్చకాయలా పేలిన తల! ట్రిగ్గర్‌ నొక్కింది అమెరికా నేవీ మాజీ సీల్‌ రాబర్ట్‌ ఓనీల్‌. ఈ విషయాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘లాడెన్‌ను కాల్చింది నేనే’ అని 2014లోనే ప్రకటించిన రాబర్ట్‌ తన తాజా పుస్తకం ‘ది ఆపరేటర్‌’లో పూర్తి వివరాలను బహిర్గతం చేశారు. 
 
ఆయన వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే... 'ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి జరిగిన పలు ఆపరేషన్‌లలో నేనూ పాల్గొన్నా. లాడెన్‌ కోసం ఏర్పాటు చేసిన టీంలో కూడా సభ్యుడినే. పాక్‌ - ఆప్ఘాన్ సరిహద్దుల్లోని అబొట్టాబాద్‌లో ఓ ఇంట్లో లాడెన్ నక్కినట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. అక్కడికెళ్లి లాడెన్‌ను చంపగలమా? లేదా? అన్నదానిపై విపులంగా చర్చించాం. ఆ ఇంటి చుట్టూ భారీ ప్రహరీ. మా దళాలు కాంపౌండ్‌ వాల్‌ను దాటుకుని లోపలికి అడుగుపెట్టాయి. 
 
ఆ ఇంట్లో ఉన్న లాడెన్‌కు పలు అంచెలుగా భద్రత ఉంది. ఒక్కో అంచెను ఛేదిస్తూ చివరి అంచెకు చేరుకున్నాం. అక్కడ ఎదురైన లాడెన్ రక్షకులను చంపేశాం. చివరగా ఓ ఇనుప గేట్‌! దాన్ని దాటితే లాడెన్ కనిపించడం ఖాయం. ఇనుప గేటును శబ్దం లేకుండా పేల్చేశాం! కానీ, లాడెన్ కనిపిస్తాడనుకున్న మాకు ఓ పెద్ద గోడ అడ్డుగా నిలిచింది. ‘శత్రువులను’ తప్పుదారి పట్టించేందుకే లాడెన్ ఆ ఇనుప గేటు ఏర్పాటు చేశాడు. ఇలాంటి వ్యూహాత్మక ఏర్పాటు ఉందంటే లాడెన్ అక్కడ ఉన్నట్లే అనుకున్నాం. మాకూ, లాడెన్‌కు మధ్య ఒకే ఒక్క అడుగు! లోపలికెళ్తే లాడెన్‌ను మేం చంపొచ్చు. లేదా లాడెన్ బలగాల చేతిలో మేమే చావొచ్చు! ఏది జరిగినా చరిత్ర సృష్టించినట్లే! సాహసంతో ముందుకెళ్లాల్సిందే.
 
ఒక్కో గదిని దాటుకుంటూ లోపలికి వెళ్లాం. ఆ గదుల్లో మహిళలు, పిల్లలూ ఉన్నారు. లాడెన్ ఏ గదిలో ఉన్నట్లు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా లాడెన్ కుమారుడు ఖలీద్‌ను గుర్తించారు. ఖలీద్‌ కనిపించాడంటే పై అంతస్తులో లాడెన్ ఉన్నట్లే. ఇది ఖాయం అని మాకు నిఘా సమాచారం అందించిన మహిళ ఇచ్చిన సంకేతం. అనుకున్నట్టుగానే ఖలీద్‌ను తొలుత చంపేశాం. 
 
ఖలీద్‌ అక్కడున్నాడంటే పైఅంతస్తులో లాడెన్ ఉన్నట్లే! చకచకా ఒక్కోమెట్టు ఎక్కుతూపై అంతస్తులోకి వెళ్లాం. ఇద్దరు మహిళలు ఎదురయ్యారు. వారిని హతం చేశాం. నిజానికి వాళ్లు మానవబాంబులు అనుకున్నాం. కానీ వారు హ్యూమన్ బాంబ్స్ కాదు. ఆ తర్వాత మరో గదిలో అడుగుపెట్టగానే ‘టార్గెట్‌’ కనిపించింది. పదేళ్లుగా వెతుకుతున్న లాడెన్ కళ్లముందు కనిపించాడు! నేను ఊహించినదానికంటే ఎత్తుగా, బక్కపలచగా ఉన్నాడు. మసక చీకటి ఉన్న గదిలో లాడెన్, ఓ మహిళ (అతడి చిన్న భార్య) ఉన్నారు. 
 
నేను లాడెన్ వైపు ఏకే-47 ఎక్కుపెట్టాను. అతడిని కాపాడేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. లాడెన్ ముందు అడ్డుగా నిలబడింది. నేను కించిత్ కూడా ఆలోచించలేదు. బుల్లెట్‌ ఆమెకు తగలకుండా రైఫిల్‌ను పైకిలేపి రెండుసార్లు ట్రిగ్గర్‌ నొక్కాను. టప్‌.. టప్‌! లాడెన్ తల పేలిపోయింది. అతను కుప్పకూలిపోయాడు. అనుమానంతో పేలిన తలలోకే మరో బుల్లెట్‌ దించాను. మిషన్ కంప్లీట్‌!' అని వివరించాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments