Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీలో భర్త విధులు.. గర్భవతి అయిన భార్య.. ఏం చేసిందో తెలుసా? (Video)

వారిద్దరు అన్యోన్య దంపతులు. భర్త ఆర్మీలో పని చేస్తున్నారు. భార్య ఇంటిపట్టునే ఉంటూ వచ్చింది. అయితే, అత్యవసరంగా దేశ రక్షణ కోసం భర్త ఆమెను వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లిన తర్వాత తాను గర్భందాల్చినట్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (08:31 IST)
వారిద్దరు అన్యోన్య దంపతులు. భర్త ఆర్మీలో పని చేస్తున్నారు. భార్య ఇంటిపట్టునే ఉంటూ వచ్చింది. అయితే, అత్యవసరంగా దేశ రక్షణ కోసం భర్త ఆమెను వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లిన తర్వాత తాను గర్భందాల్చినట్టు ఆమె గుర్తించింది. ఈ సంతోష వార్తను భర్తకు చేరవేసింది. అయినప్పటికీ.. తోడుగా ఉండలేనని, విధులే ముఖ్యమని ఆ సైనిక భర్త తేల్చి చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖానికి గురైంది. కానీ, భార్యకు నచ్చజెప్పిన ఆ భర్త... 11265 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆ భార్య ఏం చేసిందో ఈ కథనం చదవండి. 
 
ఫ్లోరిడాకు చెందిన వీస్లే బెడ్‌వెల్(21) అనే వ్యక్తి ఆర్మీలో నేవీ అధికారిగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా అతడు విదేశాలకు వెళ్లలవలసి వచ్చింది. అది కూడా 11265 కిలోమీటర్ల దూరంలో ఉన్న విధులు నిర్వహించాల్సిన నిర్బంధ పరిస్థితి. ఇంతలో అతడి భార్య నికోలే నవంబర్‌లో గర్భం దాల్చానని చెప్పింది. తాను తిరిగి రావడానికి చాలా కాలం పడుతుందని వీస్లే, నికోలేతో చెప్పాడు.
 
సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు ప్రతి భార్య కూడా తన భర్త తోడుగా ఉండాలని కోరుకుంటుంది. కానీ, ఆ అదృష్టం తనకు నికోలే బాధపడింది. అయితే, ట్రాసీలైన్ ఫోటోగ్రఫీ గురించి తెలుసుకున్న ఆమె తన స్నేహితుడు ట్రాసీ ఫుగ్గీత్‌ను కలుసుకుంది. తన బాధను అతడితో చెప్పడంతో వారి మధ్య ఉన్న 7000 మైళ్ల దూరాన్ని ఫుగ్గీత్ చెరిపేశాడు. ఇద్దర్ని ఒకేచోట ఉన్నట్లుగా ఫోటో తీశాడు. నిజంగా వారిద్దరు ఫోటో దిగారా అనిపించేలా ఉండటంతో దాన్ని అతడు సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్‌గా ఉంది. భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే, ఎంతటి దూరమైన వారిని దగ్గర చేస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం