Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి.. తీసుకెళ్లారు.. అలెక్సీ నావల్నీ ఆరోపణ

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:14 IST)
Navalny
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ రష్యా అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. విష ప్రయోగం కారణంగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్న నేపథ్యంలో.. చికిత్స నిమిత్తం తనను జర్మనీకి పంపిస్తున్నప్పుడు ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి పంపారని పేర్కొన్నారు. తనను జర్మనీకి పంపే ముందు తన దుస్తులను లాగేసుకున్నారు. తనను కోమాలో వుండగా.. ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి పంపించారు. 
 
తన శరీరంపై విషపూరిత రసాయనం ఉన్నట్టు తేలింది. అందువల్ల తన దుస్తులు అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తాయని నావల్నీ పేర్కొన్నారు. రష్యా అధికారులు వెంటనే తన దుస్తులు తనకు పంపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రత్యర్థి అయిన నావల్నీ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
గురువారం సైబీరియాలోని తామ్‌స్క్‌ నుంచి మాస్కోకు ఓ విమానంలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని ఓమ్‌స్క్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం ఎక్కేముందు ఆయన టీ మాత్రమే తీసుకున్నారనీ... బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారని నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments