Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో పారతో మట్టిని తీసి రామాయణాన్ని తిలకించిన మోడీ...

ఫిలిప్పీన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. లాస్ బానోస్ నగరంలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సందర్శించారు. అక్కడ వరి వంగడాల గురించి మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (16:18 IST)
ఫిలిప్పీన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. లాస్ బానోస్ నగరంలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సందర్శించారు. అక్కడ వరి వంగడాల గురించి మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు.. రైస్ రీసెర్చ్ ల్యాబరొటరీని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత పొలం మడిలోకి దిగి.. పారతో మట్టిని తీశారు. వరదలొచ్చినా తట్టుకుని నిలబడేలా ఉండే దృఢమైన వరి విత్తనాల కోసం ఇక్కడ పరిశోధనలు చేయాలని ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

భారత్‌కు సంబంధించిన రెండు వరి వంగడాలను రైస్ ఇన్‌స్టిట్యూట్ అధికారులకు ఇచ్చి పరిశోధనలు చేయాలని కోరారు. ఆ తర్వాత మనీలాలో మహావీర్ ఫిలిప్పైన్స్ ఫౌండేషన్‌ను విజిట్ చేశారు. అక్కడ భారతీయ సంప్రదాయ వైద్యంతో కొత్త జీవితం గడుపుతున్న  వారితో కాసేపు ముచ్చటించారు. 
 
పిమ్మట ఆసియాన్ స‌ద‌స్సు స్వర్ణోత్సవాలు జ‌రుగుతోన్న‌ నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనీస్‌ ప్రధాని లీ కెఖియాంగ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌ద‌ర్శించిన రామాయ‌ణాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌తో క‌లిసి ప్రధాని మోడీ తిల‌కించారు.
 
భారతీయ సంస్కృతిని ప్ర‌తిబింభిస్తూ వేదికపై వేసిన ఆ ప్ర‌ద‌ర్శ‌నలు అంద‌రినీ అల‌రించాయి. రెండు రోజులు జరిగే ఆసియాన్‌ సదస్సు ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ఈ వేడుక‌ను నిర్వ‌హించారు. రామాయణాన్ని అక్కడ ‘మహారదియా లవాన’ (రావణ) అంటారు. ఆ దేశంలో ప్ర‌సిద్ధ‌ ‘సింగ్‌కిల్‌’ నృత్యానికి కూడా రామాయణమే ఆధారం. 
 
ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ - మోడీలు కాసేపు మాట్లాడుకున్నారు ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా, అమెరికా మధ్య బంధం రోజురోజుకూ బలోపేతమవుతున్నదని మోడీ అన్నారు. ఆసియా అభివృద్ధి కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాయని స్పష్టంచేశారు. 
 
ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమెలా అన్న అంశంతోపాటు పలు కీలక విషయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. మోడీ మంచి స్నేహితుడయ్యారని, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఇద్దరం కలిసి ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని, భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments