Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో రేప్ చేశాడు.. ఆస్ట్రేలియాకు వచ్చి కోర్కె తీర్చమంటూ వేధింపులు..

తన మాజీ బాస్‌పై ఓ ఎన్నారై మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. భారత్‌లో ఉండగా తనపై అత్యాచారం చేశాడనీ, అక్కడ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాకు వస్తే... అక్కడకు కూడా వచ్చి కోర్కె తీర్చమని వేధిస్తూ వెంటపడుతున్నట్ట

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (15:38 IST)
తన మాజీ బాస్‌పై ఓ ఎన్నారై మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. భారత్‌లో ఉండగా తనపై అత్యాచారం చేశాడనీ, అక్కడ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాకు వస్తే... అక్కడకు కూడా వచ్చి కోర్కె తీర్చమని వేధిస్తూ వెంటపడుతున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మాజీ బాస్‌ కోసం గాలిస్తున్నారు.
 
హైదరాబాద్‌కు చెందిన 38 యేళ్ల మహిళ ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. ఈ కంపెనీ గురు‌గ్రామ్‌లో ఉండేది. ఈ కంపెనీలో పని చేసే బాస్‌తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మాటలు శృతిమించాయి. మాటలతో పాటు చాటింగ్‌లు చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో 2013 మార్చిలో బాధితురాలు ఒంటరిగా ఉన్న వేళ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బెదిరించసాగాడు. 
 
ఆపై పలుమార్లు పెద్ద నగరాల్లోని హోటళ్లకు తీసుకెళ్లి పదేపదే అత్యాచారాలు చేశాడు. అతని బెదిరింపులకు తాళలేక లక్షల కొద్దీ డబ్బులను ఆమె ఇచ్చింది. ఇక ఆమె వల్లకాక, బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అతను అక్కడికీ వచ్చి వేధింపులు మొదలు పెట్టాడు. తన భర్తకు ఈ-మెయిల్స్ పంపుతూ తనను వేధిస్తూ, వెంటాడుతున్నాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments