Webdunia - Bharat's app for daily news and videos

Install App

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

సెల్వి
గురువారం, 5 జూన్ 2025 (23:02 IST)
Donald Trump-ELon Musk
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మాజీ మిత్రుడు ఎలోన్ మస్క్ చుక్కలు చూపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా కేంద్ర బడ్జెట్ బిల్లుపై ఎలోన్ మస్క్ చేసిన విమర్శలతో తాను చాలా ఆశ్చర్యపోయాను, ఇంకా నిరాశ చెందానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో ఎలోన్‌తో గొప్ప సంబంధాన్ని కలిగివుంటామో లేదో తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. 
 
పన్నులు తగ్గించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం అనే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మస్క్ లాబీయింగ్ ప్రయత్నాలపై ట్రంప్ చేసిన విమర్శలు ఇవే. ఈ ప్రణాళిక గురించి మస్క్‌పై కొంతమంది రిపబ్లికన్లు విమర్శలు గుప్పించారు.
 
ఈ విమర్శలకు మస్క్ స్పందిస్తూ.. ట్రంప్‌పై రెట్టింపు విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్‌ను కృతజ్ఞత లేనివాడని ఏకిపారేశారు. "నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు" అని మస్క్ ఫైర్ అయ్యారు. 129 రోజుల ఉద్యోగం తర్వాత మస్క్ గత వారం ప్రభుత్వ సామర్థ్య విభాగంలో తన పదవిని విడిచిపెట్టారు. మే 30న జరిగిన అభినందన వార్తా సమావేశంలో ట్రంప్ అతనికి బంగారు కీని బహుకరించారు. 
Donald Trump, ELon Musk,
 
కానీ ఆ తర్వాత రోజుల్లో, ట్రంప్ బడ్జెట్ బిల్లుపై పదే పదే విమర్శించారు. ఈ బిల్లుకు ఓటు వేసిన వారికి సిగ్గు లేదన్నారు. తప్పు చేశారని పోస్టు చేశారు. ట్రంప్ పార్టీకి చెందిన కొద్దిమంది ప్రతినిధులతో, డెమొక్రాట్లందరూ వ్యతిరేకించడంతో, చాలా మంది రిపబ్లికన్ల మద్దతుతో కేంద్ర బడ్జెట్‌‍ బిల్లును వైట్ హౌస్ ఆమోదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments