Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వాసులకు ధన్యవాదాలు చెప్పిన పాకిస్థాన్ తల్లి.. ఎందుకు..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (13:05 IST)
భారతీయుల ఉదార గుణానికి ఓ పాకిస్థాన్ తల్లి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పింది. ఓ వైపు శివసేన కార్యకర్తలు పాకిస్తాన్‌పై మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఓ పాకిస్థాన్ బాలిక కోసం భారతీయులు సహాయం చేశారు. చికిత్స కోసం భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ చిట్టితల్లికి అవసరమైన లక్షలాది రూపాయలను భారతీయులు దానమిచ్చారు.  
 
వివరాల్లోకి వెళితే.. కరాచీలో ఉన్న 15 ఏళ్ల బాలిక  సబా తారిఖ్ అహ్మద్ విల్సన్ డిసీజ్ అనే వ్యాధితో బాధపడుతూ వచ్చింది. ఈ వ్యాధి చికిత్స కోసం తన తల్లి నజియాతో కలిసి సబా ఇండియా వచ్చింది. శరీరంలో కాపర్ స్థాయి పెరగడంతో రక్తంలో అది విషంగా మారుతుంది. తద్వారా ప్రాణాలను హరిస్తుంది. దీనికి చికిత్స చేయాలంటే లక్షలు వెచ్చించాలి. అయితే పాకిస్థాన్ తల్లి వద్ద అంత డబ్బుల్లేకపోవడాన్ని గమనించిన బ్లూబెల్స్ కమ్యూనిటీ అనే ఎన్జీవో సంస్థ.. సామాజిక మాధ్యమాల ఆధారంగా ముంబై వాసుల నుంచి రూ.7లక్షలు సమీకరించింది. 
 
ఇలా వందలాది మంది చేసిన సాయంలో రూ.13లక్షల నిధి ఏర్పడింది. దీంతో పాకిస్థాన్ బాలికకు చికిత్స పూర్తయ్యింది. అంతేగాకుండా ఆరోగ్యవంతురాలిగా ఆ పాక్ బాలిక కరాచీకి బయల్దేరింది. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స అందించిన జస్ లోక్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ తరణ్ జ్ఞాన్ చందానీ చెప్పారు. తన బిడ్డ బతికి బయటపడేందుకు సహకరించిన భారతీయులకు, వారి ఉదార గుణానికి ఆ తల్లి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments