Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జిబుష్ అసభ్యంగా ప్రవర్తించారు...

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను వేధించాడంటూ కొంత‌మంది హీరోయిన్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈవిధంగా ప్రముఖుల చేతిలో వేధింపులకు గురైన మహిళలు మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తమకు జరిగిన అన్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (11:23 IST)
హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను వేధించాడంటూ కొంత‌మంది హీరోయిన్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈవిధంగా ప్రముఖుల చేతిలో వేధింపులకు గురైన మహిళలు మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. తాజాగా, అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ హెచ్‌ డ‌బ్ల్యూ బుష్ సీనియ‌ర్ త‌న‌ను అస‌భ్యంగా ముట్టుకున్నాడంటూ మిచిగాన్‌కి చెందిన 55 ఏళ్ల మ‌హిళ ఆరోపణలు చేసింది. 
 
బుష్ రెండో సారి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా డియ‌ర్‌బోన్‌లో ఉన్న‌పుడు త‌న‌తో అధ్య‌క్షుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆ మహిళ తెలిపింది. కానీ మీడియా సమావేశంలో ఫోటో దిగుతుండగా అలా జరిగివుంటుందని తాను అనుకున్నానని కానీ.. బుష్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. 
 
ఇటీవ‌ల 2003 నుంచి 2016 మ‌ధ్య‌కాలంలో త‌మ‌ను లైంగికంగా బుష్ వేధించాడంటూ బ‌య‌టికి చెప్ప‌డంతో త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి పున‌రాలోచ‌న చేసిన‌పుడు బుష్ కావాల‌నే చేసిన‌ట్లు అర్థ‌మైంద‌ని తెలిపింది. తనతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌పుడు ఆయ‌న మ‌ధ్య‌వ‌య‌స్కుడేనని ఆ మ‌హిళ చెప్పింది. ఈ ఆరోప‌ణ‌లు బుష్ ప్ర‌తినిధి జిమ్ మెక్‌గ్రా కొట్టిపారేశారు. దీనికి ముందు వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు బుష్ త‌ర‌ఫున‌ జిమ్ మెక్‌గ్రా క్ష‌మాప‌ణ‌లు కోరిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం