Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్ థెరెసాకు సెయింట్ హుడ్ ప్రదానం... కోట్లాది మంది వీక్షణ

మాతృమూర్తి మదర్ థెరెసాకు రోమ్‌లోని వాటికన్ సిటీలో సెయింట్ హుడ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో లక్షలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (15:08 IST)
మాతృమూర్తి మదర్ థెరెసాకు రోమ్‌లోని వాటికన్ సిటీలో సెయింట్ హుడ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో లక్షలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ఎక్కడో యుగోస్లేవియాలో ఆగ్రెస్ గోక్షా బుజాక్షువుగా జన్మించి, థెరెసాగా రోమన్ క్యాథలిక్ మఠ కన్య జీవితం ప్రారంభించి, మిషనరీస్ ఆఫ్ ఛారీ సేవల్లో భాగంగా కోల్‌కతా మురికివాడల్లోని అన్నార్తుల సేవలో తరించి మదర్ థెరెసాగా వినుతికెక్కిన ఆమె కీర్తి కిరీటంలో నోబెల్ బహుమతి చేరింది. ఇది భారత దేశానికి విశిష్టమైన గుర్తింపు తెచ్చింది. పోప్ ఫ్రాన్సిస్ సారథ్యంలోని ప్రత్యేక బృందం కాననైజేషన్ కార్యక్రమం నిర్వహించింది. 
 
ఈ కార్యక్రమంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నుంచి వందలాది క్రైస్తవ మఠకన్యలు, మత గురువులు, బిషప్‌లు, అర్చ్ బిషప్‌లు, కార్డినళ్లు, లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీంతో వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా ముందు సువిశాల ప్రాంగణం జన సంద్రంగా మారింది. భారత్ నుంచి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు కోల్‌‌కతా ఆర్చిబిషప్ థామస్ డిసౌజా ఆధ్వర్యంలో 45 మంది బిషప్‌‌లు, మదర్ థెరీసా స్థాపించిన లిటిల్ ఫ్లవర్స్ చారిటీ మిషనరీల నుంచి 50 మంది నన్స్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో 12 మంది సభ్యుల బృందం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాలు పంచుకున్నారు. 
 
మదర్‌ థెరిసా మహాప్రస్థానం.. 
జననం: 1910, ఆగస్టు 26, మాసిడోనియా స్కోప్జేలో జననం. పేరు.. ఆగ్నెస్‌ గోన్‌క్సా బోజాక్సియు.
మరణం: 1997, సెప్టెంబరు 5. కోల్‌కతాలో
జన్మదినం: బాప్టిజం స్వీకరించిన ఆగస్టు 27. 
మతప్రస్థానం: ఐర్లాండ్‌లోని సిస్టర్స్‌ ఆఫ్‌ లోరెటో అనే క్యాథలిక్‌ వ్యవస్థలో చేరేందుకు 18 ఏళ్ల వయసులో ఇంటిని వదిలి వెళ్లారు. 1929లో భారత్‌కు వచ్చారు. పేరు థెరిసాగా మార్పు
ఉపాధ్యాయురాలు: 1931 నుంచి 1948 వరకు కోల్‌కతాలోని సెయింట్‌ మేరీస్‌ ఉన్నత పాఠశాలలో సిస్టర్‌ థెరిసా బోధన సేవలందించారు.
మలుపు: 1946, సెప్టెంబరు 10న 'దైవపిలుపు'ను అందుకొని కోల్‌కతా మురికివాడలకు చేరారు. అక్కడి ప్రజలు ఆమెను పూజ్యభావంతో 'మదర్‌' థెరిసాగా పిలుచుకున్నారు.
 
కొత్త వ్యవస్థ: 1950, అక్టోబరు 7న ‘మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ’ ఏర్పాటుకు క్యాథలిక్‌ చర్చి అనుమతి పొందారు.
గుర్తింపు: 1979లో నోబెల్‌ శాంతి బహుమతి. 1980లో భారతరత్న. 1971లో 23వ పోప్‌జాన్‌ శాంతి బహుమతి. 1969లో నెహ్రూ పురస్కారం. 1978లో బల్జాన్‌ పురస్కారం. 1973లో టెంపుల్టన్‌ పురస్కారం. 1962లో మెగాసెసే అవార్డు.
కీలకఘట్టం: సెయింట్‌ హోదా పొందేందుకు ముందస్తు అడుగైన 'బీటిఫికేషన్' ప్రక్రియను 2003లో రెండో పోప్‌ జాన్‌పాల్‌ పూర్తిచేశారు.
తుదిఘట్టం: 2016, సెప్టెంబరు 4న మదర్‌ థెరిసాకు క్యాథలిక్‌ చర్చి పునీత హోదా ప్రకటన. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments