హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ - శుభవార్త చెప్పిన మోడెర్నా

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (18:42 IST)
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ హడలెత్తిస్తుంది. దీంతో అనేక ప్రపంచ దేశాలు ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అదేసమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకుని, మాస్కులు ధరించాలంటూ కోరారు. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓషధ తయారీ కంపెనీ మోడెర్నా ఓ శుభవార్త చెప్పింది. కోవిడ్ -19 తాజా  వేరియంట్ ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా తమ బూస్టర్ వ్యాక్సిన్ యాంటీబాడీ లెవెల్స్‌ను గణనీయంగా పెంచుతుందని ఈ కంపెనీ వెల్లడించింది. 
 
బూస్టర్ డోసులకు ముందున్న యాంటీబాడీలతో పోలిస్తే 50 మైక్రోగ్రాముల బూస్టర్‌తో యాంటీబాడీలను 37 రెట్లు పెంచుతాయని, 100 మైక్రో గ్రాముల బూస్టర్‌తో యాంటీ బాడీలు ఏకంగా 83 రెట్లు పెరుగుతాయని తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆ కంపెనీ సీఈవో స్టీఫెన్ బన్సెల్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కంపెనీ బూస్టర్ డోస్ సురక్షితమైనదని, ఎలాంటి ముఖ్యమైన సైట్ ఎఫెక్ట్స్ తలెత్తకుండా రెండో దశ అధ్యయనంలో తేలిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments