Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో హెడ్ ఫోన్స్ పేలిపోయాయి.. యువతి ముఖం కాలిపోయింది..

హ్యాపీగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నారా? కాస్త జాగ్రత్త పడండి. ఓ విమానంలో హెడ్ ఫోన్స్ పేలిపోయాయి. అంతే హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకున్న యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్‌ నుంచి మెల్‌బోర్న్

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (12:42 IST)
హ్యాపీగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నారా? కాస్త జాగ్రత్త పడండి. ఓ విమానంలో హెడ్ ఫోన్స్ పేలిపోయాయి. అంతే హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకున్న యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్‌ నుంచి మెల్‌బోర్న్‌ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్ధం రావడంతో యువతి ఉలిక్కిపడి లేచింది. అప్పటికే చెవికున్న హెడ్‌ఫోన్స్ నుంచి మంటలొచ్చేశాయి. 
 
మొహం, చేతులు నల్లగా కాలిపోయాయి. హెడ్‌ఫోన్స్‌ కాలిపోవడం గుర్తించిన యువతి.. వెంటనే వాటిని తీసి పక్కకు పడేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మెడ మొత్తం మొహం కాలిపోయుండేదని బాధిత యువతి భయాందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన విమాన సిబ్బంది.. లిథియం బ్యాటరీల కారణంగా విమానాల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. కానీ పేలిన హెడ్ సెచ్ ఓ కంపెనీకి చెందినదనే విషయాన్ని మాత్రం బయటికి పొక్కలేదు. అంతేగాక, సదరు విమాన వివరాలు తెలిపేందుకు కూడా ఇష్టపడలేదు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments