Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నీది, మాది కాదు.. అందరిదీ.. నిద్రలేని రాత్రులు గడపటం ఖాయం..

Webdunia
శనివారం, 20 జులై 2019 (13:25 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాకు ఉన్న భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనాన్ని చాటుతోందన్నారు. 
 
మైనార్టీ జాతికి చెందిన నలుగురు మహిళా కాంగ్రెస్ సభ్యుల పట్ల ట్రంప్ వ్యాఖ్యలను మిషెల్ తప్పుబట్టారు. ఇది మా అమెరికా... మీ అమెరికా కాదు.. మనందరి అమెరికా అంటూ చురకలు అంటించారు.

అమెరికాలో ప్రతి ఒక్కరికీ చోటు వుందన్నారు. ఇక్కడ పుట్టినా లేకున్నా.. ఇక్కడ నివసిస్తున్న వారంతా అమెరికన్లేనని మిషెల్ పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ను వుద్దేశించి మిషెల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 
 
కాగా అమెరికాలో మీరు సంతోషంగా లేకపోతే.. మీరు పుట్టిన స్వస్థలాలకు వెళ్ళిపోవాలని.. నలుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ మండిపడ్డారు. అయితే ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు మండిపడుతున్న వేళ.. ట్రంప్‌పై మిషెల్ పరోక్షంగా విమర్శలు చేసింది. 
 
అలాగే నలుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యుల్లో ఒకరైన ఇల్హన్ ఒమర్ మాట్లాడుతూ, సోమాలియా నుంచి వచ్చిన మహిళ ఎదగడాన్ని ట్రంప్ భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయాలతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని... ట్రంప్ కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామని హెచ్చరించారు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments