Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ యాక్టింగ్ చూసి నా గుండెల్లో కత్తి దించినట్లు ఫీలయ్యా: 'ఆస్కార్' నటి మెరిల్ స్ట్రీప్

ట్విట్టర్‌లో ఇప్పుడిదే చర్చ... హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... ఇలా ఒక్కరేమిటి ప్రపంచమంతా ఇప్పుడు మూడుసార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆ హాలీవుడ్ నటి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన విమర్శనాస్త్రాలు సంధించడంపై చర్చించుకుంటోంది. గోల్

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (16:40 IST)
ట్విట్టర్‌లో ఇప్పుడిదే చర్చ... హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... ఇలా ఒక్కరేమిటి ప్రపంచమంతా ఇప్పుడు మూడుసార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆ హాలీవుడ్ నటి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన విమర్శనాస్త్రాలు సంధించడంపై చర్చించుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందర్భంగా మెరిల్ స్ట్రీప్ సుమారు ఆరు నిమిషాల పాటు మాట్లాడింది. మాట్లాడినంతసేపూ ట్రంప్ గురించే మాట్లాడింది. అగ్రరాజ్యాన్ని ఏలే ఒక దేశాధినేత చేష్టలు చూసిన తనకు ఎంతో ఆవేదన కలిగిందని చెప్పింది. 
 
అమెరికా నుంచి మెక్సిక‌న్లు, ఇత‌ర విదేశీయులు, ముస్లింల‌ను వెళ్లగొడతామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. అసలు హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వున్నవారంతా వాళ్లే కదా... వారే లేకపోతే ఇక్కడ ఏముటుందని ప్రశ్నించింది. అంతేకాదు... తన ప్రచారం సందర్భంగా ఓ వికలాంగ రిపోర్టర్ ను ఆయన హేళన చేస్తూ అనుకరిచడం చూసి తనకు గుండెల్లో కత్తి దింపినంత బాధ కలిగిందని వ్యాఖ్యానించింది. ఒక దేశానికి కాబోయే అధినేత శైలి ఇలా వుండటాన్ని తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆమె వెల్లడించింది. ట్రంప్ గురించి స్ట్రీప్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో చర్చ జరుగుతోంది. ఆమెకు మద్దతుగా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments