Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విషయంలోనూ ట్రంప్‌ది బుల్లీయింగే.. చాచి కొడుతున్న మెలనియా

తన ప్రత్యర్థులతోటే కాదు సొంత భార్య పట్ల కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపుతున్న అహంభావ వైఖరితో అమెరికా ప్రథమ మహిళ మెలనియా విసిగిపోతున్నట్లు సమాచారం. అమెరికా ప్రథమ మహిళగా తనకున్న అధికారిక గుర్తింపు, గౌరవాన్ని కూడా తోసి రాజంటున్న భర్త వైఖరి మ

Webdunia
బుధవారం, 24 మే 2017 (08:58 IST)
తన ప్రత్యర్థులతోటే కాదు సొంత భార్య పట్ల కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపుతున్న అహంభావ వైఖరితో అమెరికా ప్రథమ మహిళ మెలనియా విసిగిపోతున్నట్లు సమాచారం. అమెరికా ప్రథమ మహిళగా తనకున్న అధికారిక గుర్తింపు, గౌరవాన్ని కూడా తోసి రాజంటున్న భర్త వైఖరి మెలనియా ట్రంప్‌ను తీవ్రంగా గాయపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ట్రంప్ మొదలెట్టిన విదేశీ ప్రయాణాల్లో కూడా ట్రంప్ అధ్యక్ష దంపతులం అనే విషయాన్ని మర్చిపోయి ప్రథమ మహిళను వెనకే వదిలిపెట్టి దూకుడుగా ముందు కెల్లడం మెలినియాను బాధిస్తోందని, అందుకే  ముందునుంచి తనకేసి చేయి చాపుతున్న ట్రంప్ చేయిని గట్టిగా తడుతూ అతడి ప్రతిపాదనను తిరస్కరిస్తోందని సాక్ష్యాధారాలతో సహా తెలిసిపోయింది.
 
ట్రంప్ దంపతులను చాలాకాలంగా గమనిస్తూ వస్తున్న శరీర వ్యక్తీకరణ నిపుణురాలు పాట్టి ఉడ్స్ అమెరికా అధ్యక్ష దంపతుల మధ్య పొడసూపుతున్న తేడాను, అభిప్రాయ భేదాలును మెలనియా కదలికలను బట్టి, ఆమె ప్రదర్శిస్తున్న భంగిమలను బట్టి స్పష్టంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అధ్యక్ష దంపతులు మద్య సంబంధాల విషయంలో కొట్టొచ్చినట్లు తేడా కనిపించిందని ఉడ్స్ చెబుతున్నారు.

ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌‌లో విమానాశ్రయంలో విమానం నుంచి దిగిన ట్రంప్ అమెరికా ప్రథమ మహిళను ఏమాత్రం గమనించకుండా తన పాటికితాను వేగంగా నడుస్తూ వెనుకబడిన మెలినియా వైపు చేయి సాపాడని, దీనికి ఆమె అతడి చేయిని బలంగా కొట్టి తన పాటికి తాను కార్పెట్‌కు ఒకవైపు నుంచి నడుచుకుంటూ వెళ్లిందని వుడ్స్ చెప్పారు. ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా కనిపించాలనుకుంటున్నారు తప్ప, అధ్యక్ష దంపతుల్లో తాను భాగం అనే విషయం గమనించడం లేదని వుడ్స్ అన్నారు. 
 
భర్త తనవైపు చాచిన చేతిని పక్కకు తోసేస్తూ మెలినియా ప్రదర్శించిన భంగిమ ఆ దంపతుల మధ్య ఐక్యత లేనట్లు సూచిస్తోందని, పాట్టి ఉడ్ విశ్లేషించారు. ట్రప్ తన అధికారాన్ని చూపడానికి ఆమెకంటే ముందువెళుతూ వెనక్కి చేయి సాచాడని, ఆమెను చిన్న పిల్లగా ట్రీట్ చేసినట్లుగా ఆ దృశ్యం కనిపించిందని, నన్ను చిన్నపిల్లగా భావించి చేయిపట్టి నడిపించలేవనే ధిక్కారాన్ని ఆమె ప్రదర్సించారని ఉడ్స్ వర్ణించారు.

అధ్యక్షుడు కాకముందు ట్రంప్ బహిరంగ వేదికలమీదే మెలనియా శరీరానికి అతి సన్నిహితంగా మెలుగుతూ పదిమంది ముందు ఆమె శరీరంలోను సున్నిత భాగాలను స్పర్శిస్తూ తమమధ్య సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ గత కొద్ది నెలలుగా అధ్యక్ష పదవి తెచ్చిపెట్టిన అధికారాన్ని ప్రదర్శిస్తూ మెలనియాను వెనుకకు నెట్టి తానొకడే ముందుకెళుతున్నట్లుగా అనేక దృశ్యాలు కనిపించాయని శరీర భాషా అధ్యయనకారిణి ఉడ్స్ చెప్పారు. 
 
ఫిబ్రవరి నుంచి ట్రంప్‌ను మెలనియా అనేకసార్లు చేయిపట్టుకుని అబిమానాన్ని, సాన్నిహిత్యాన్ని ప్రదర్శించినప్పటికీ ట్రంప్ ఆమె ఇష్టాన్ని గమనించకుండా చేయి వదిలించుకుని దూరం జరుగుతున్న దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయని వుడ్స్ చెబుతున్నారు. దీంతో భర్త ప్రవర్తనతో గాయపడిన మెలినియా ఆగ్రహాన్ని కూడా ప్రదర్శిస్తూ వచ్చారని వుడ్స్ చెప్పారు. 
 
వాస్తవానికి ట్రంప్‌తో తన వివాహ బంధం పట్ల మెలనియా సంతోషంగా లేరని తెలుస్తోంది. ఇజ్రాయిల్ విమానాశ్రయంలో జరిగిన ఘటన కూడా వారిద్దరి వివాహ బంధాన్ని సమస్యాత్మకం చేసే ధోరణిలోనే కనిపించినట్లు భావిస్తున్నారు.
 
మొత్తం మీద ఏకవాక్యంలో చెప్పాలంటే ట్రంప్ ప్రపంచాన్నే కాదు..తన భార్యను కూడా లెక్క చేయడు. ఇదే వాస్తవం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments