Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసూతి సెలవులకు డబ్బులివ్వని పిసినిగొట్టు దరిద్రపు దేశం అమెరికా..

సోషలిస్టు సమాజ భావన నుంచి భారత్ ఎంత దూరం వైదొలిగినా సోషలిస్టు సమాజాలకు చెందిన సామాజిక సంక్షేమ చర్యలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత విస్తృతంగా, ప్రశంసనీయంగా కొనసాగుతుండటం మన సామాజిక, రాజకీయ పునాది చెక్కుచెదరలేదని నిరూపిస్తోంది.

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (06:34 IST)
సోషలిస్టు సమాజ  భావన నుంచి భారత్ ఎంత దూరం వైదొలిగినా సోషలిస్టు సమాజాలకు చెందిన సామాజిక సంక్షేమ చర్యలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత విస్తృతంగా, ప్రశంసనీయంగా కొనసాగుతుండటం మన సామాజిక, రాజకీయ పునాది చెక్కుచెదరలేదని నిరూపిస్తోంది. తాజాగా మన దేశంలో ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి 18 లక్షల మంది ఉద్యోగినులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. బిడ్డల సంరక్షణకు తగినంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఇస్తున్నారు? ఈ సమయంలో ఎంత శాతం వేతనం చెల్లిస్తారనే అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి.
 
ప్రజాస్వామ్య ఆదర్శానికి తానే పట్టుగొమ్మగా తెగపొగుడుకునే ప్రపంచ పెద్దన్న అమెరికాలో ప్రసూతి సెలవులు దారుణంగా ఉంటున్నాయని సమాచారం. అక్కడ ప్రసూతి మహిళలు 12 వారాలు సెలవు తీసుకోవచ్చుగాని జీతం అసలు రాదు. ఇలా వేతనం లేకుండా ప్రసూతి సెలవులిచ్చే దేశాలు ప్రపంచంలో మూడే ఉన్నాయి.. అవి, అమెరికా, లైబీరియా, పపువా న్యూగినియా. వేతనంతో కూడిన సెలవుల విషయంలో నార్వే తొలి స్థానంలో ఉండగా,  పనివేళల్లో వెసులుబాటు, సెలవులను తల్లిదండ్రులు పంచుకొనే సౌలభ్యం తదితరాల్లో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది.
 
స్వీడన్ లో తల్లిదండ్రులిద్దరికీ కలిపి ఇచ్చే 480 రోజుల సెలవులను బిడ్డకు ఎనిమిదేళ్లు నిండేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటూ ఉంది. అయితే ఎన్ని గంటలు పనిచేశామో అంత కాలానికే వేతనం ఇస్తారు. ఫ్రాన్స్ లో తల్లి అయిన ఉద్యోగిని ప్రసూతి సెలవుల అనంతరం రెండున్నరేళ్ల వేతనం లేని ఫ్యామిలీ సెలవు తీసుకోవచ్చు. తండ్రికి కూడా పిల్లల పెంపకంలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పురుషులు సెలవు తీసుకోవడాన్ని కొన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. దత్తత తీసుకున్న దంపతులకు, స్వలింగ దంపతులకు ఫ్రాన్స్ , యూకే, కెనడా, స్వీడన్ లు ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.
 
ఈ లెక్కన చూస్తే భూతలస్వర్గం అని భారత్‌ను ప్రశంసించలేం కానీ అమెరికా వ్యవస్థ కల్లో కూడా ఇవ్వని సౌకర్యాలను, సంక్షేమ చర్యలను భారత్ తన పౌరులకు ఇస్తుండటం చూస్తే మనం కాస్త గర్వించవచ్చు.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments