డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి అంకితం : మరియా కొరినా

ఠాగూర్
శనివారం, 11 అక్టోబరు 2025 (09:54 IST)
తనకు వచ్చిన ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, వెనెజువెలా ప్రజలకు అంకితమిస్తున్నట్టు పురస్కార విజేత మరియా కొరియా మచాదో ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోను వరించిన విషయం తెల్సిందే. ఈ మేరకు నోబెల్ కమిటి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 
 
దీనిపై తాజాగా మచాదో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు. వెనిజువెలా ప్రజల లక్ష్యానికి ట్రంప్ నిర్ణయాత్మకంగా మద్దతిచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరియా పోస్టులో వెల్లడించారు. వెనిజువెలా ప్రజల పోరాటానికి దక్కిన ఈ గుర్తింపు తమ కర్తవ్యాన్ని ముగించడానికి ఒక ప్రోత్సాహకమని పేర్కొన్నారు. స్వేచ్ఛ పొందేందుకు దోహదపడుతుందన్నారు. విజయానికి చేరువలో ఉన్నామని పేర్కొన్నారు.
 
నేడు గతంలో కంటే ఎక్కువగా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలను తమ ప్రధాన మిత్రులుగా విశ్వసిస్తున్నామని వివరించారు. అంతకుముందు నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టియన్ బ్రెగ్ హార్ప్ క్వెన్‌తో ఫోనులో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శాంతి పురస్కారాన్ని ఇవ్వనున్న విషయాన్ని ఆమెకు ముందుగానే తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments