Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మే సర్వస్వం... స్నానం చేయించి బొట్టుపెడతాడు.. ఎవరా వ్యక్తి?

ఒంటరితనం జీవితంలో అన్నింటిని నేర్పిస్తుంది. ప్రేమించిన వారికి దూరమైనప్పుడు వారి ప్రేమ లోతు విహ బంధం తెలుస్తుంది. అన్నింటినీ మించి ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఈ ఒంటరితనాన్ని ఒక బిజినెస్ మ్యాన్... తన

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (12:00 IST)
ఒంటరితనం జీవితంలో అన్నింటిని నేర్పిస్తుంది. ప్రేమించిన వారికి దూరమైనప్పుడు వారి ప్రేమ లోతు విహ బంధం తెలుస్తుంది. అన్నింటినీ మించి ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఈ ఒంటరితనాన్ని ఒక బిజినెస్ మ్యాన్... తన కలల రాకుమారితో జయించాడు. ఆ కలల రాకుమారి ఎవరో కాదు ఓ బొమ్మ. ఇతగాడు వ్యాపార పనుల మీద దేశవిదేశాలు తిరుగుతుంటాడు. అలా వెళ్లినప్పుడు ఒంటరితనాన్ని అనుభవించేవాడు. ఈ ఒంటరితనం నుంచి బయట పడటానికి ఒక బొమ్మను తెచ్చుకున్నాడు. ఇప్పుడా బొమ్మే అతనికి సర్వస్వం. దాన్నే తన కలల రాకుమారిగా భావించి… దాంతో సహజీవనం చేస్తున్నాడు. 
 
నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, షాపింగులు, షికారులు ఇలా అన్నిటికి ఆ బొమ్మను తీసుకెళుతున్నాడు. ఎవరైనా దాన్ని బొమ్మ అంటే అస్సలు ఊరుకోడు వారి మీద చిరుబురులాడతాడు. ఆ వింత మనిషి పేరు సెన్జి నకజామా. వయస్సు 61 ఏళ్లు. జపాన్‌లోని టోక్యోలో నివసిస్తున్నాడు. ఆయన కలలరాకుమారి పేరు సౌరి. ఈ పెద్దాయన ఎక్కడికి వెళ్లినా.. సౌరిని తీసుకువెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 
 
ఎవరేమనుకున్నా నాకేంటి అంటున్నాడు. షాపింగ్‌కు తీసుకువెళుతున్నాడు. బోటులో షికారులకు వెళుతున్నాడు. టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వీల్ చెయిర్‌లోనే తీసుకువెళుతూ అన్నీ చూపిస్తున్నాడు. స్నానం చేయిస్తాడు. తల దువ్వుతాడు. ఆమె కోసం విగ్గులు కొన్నాడు.. రకరకాల డ్రెస్సులు కొన్నాడు. సెన్జి నకజామా అపార్ట్‌మెంట్‌కు వెళితే… అక్కడి సౌరి హంగు ఆర్భాటం చూసి అందరికి దిమ్మదిరిగిపోవాల్సిందే. 
 
దాని హంగూబొంగూ అన్నిచూస్తే సామాన్యులు సైతం కుళ్లుకోకమానరు. బొమ్మకే ఇంతలా చేస్తున్నాడు.. భార్య ఉంటే ఇంకెలా చూసుకునేవాడో అని ఆశ్చర్యపోతున్నారా.. పెద్దాయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయనకు ఈ బొమ్మే అన్నీ అయ్యింది. ప్రాణంతో సమానం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం