Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా.. నా పెళ్ళియంట...! ఓహో... నా పెళ్ళియంట.. రోబోల పెళ్ళి సందడి...!!

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (22:26 IST)
అరెరె... ఇది భళే తమాషాగా ఉంది. తమాషానే ఆ రోబోలు నిజంగా పెళ్ళి చేసుకున్నాయి.  వధువు రోబో సిగ్గుతో తల వంచుకుంటే వరుడు రోబో టీవీగా వధువు రోబో మెడలో తాళి కట్టింది. వీరిద్దరికి వివాహం జరిపించిన పురోహితుడు ఎవరబ్బా అనేగా మీ అనుమానం... అది రోబోనే. ఇంతకీ ఈ రోబోల పెళ్ళి తంతు జరిగింది ఎక్కడో..? రండి తెలుసుకుందాం.. 
 
జపాన్ లో రోబోల వివాహం జరిగింది. రెండు రోబో తయారీ కంపెనీలు వాటికి పెళ్లి చేసి ప్రచారం పొందాలని నిర్ణయించాయి. ఇక అంతే, 'మయవా డేంకీ' కంపెనీ రూపొందించిన 'ఫ్రోయీన్' రోబో వరుడుకి  'టకయుకి టోడో' కంపెనీ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో 'యుకిరిన్' అనే వధవును ఇఛ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. 
 
రెండు కంపెనీల ప్రతినిధుల సమక్షంలో అచ్చం పెళ్లి కుమార్తెగా తెల్లని గౌనులో వచ్చిన 'యుకిరిన్'ను 'ఫ్రోయీన్' వివాహమాడాడు. వీరికి వివాహం జరిపించిన 'పెప్పర్' కూడా రోబో. వివాహానంతరం కేక్ కట్ చేసిన అతిథులను రోబో బ్యాచ్ వీనులవిందు చేసింది. చివరకు ఆర్కెస్ట్రా కూడా రోబోలే చేశాయి. 
 
మన జీవితాల్లో ఇక రోబో పెళ్ళి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు రావడానికి టైం పట్టవచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని అనుసరించి రోబో పురోహితులు, ఆర్కెస్ట్రాలు రావడానికి ఎంతో సమయం లేదని ఇట్టే అర్థమై పోతోంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments