Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీ బేసిక్స్‌కు ట్రాయ్ రెడ్ సిగ్నల్: నిరాశకు గురయ్యా!... అయినా వదలను.. జుకెర్ బర్గ్

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (08:56 IST)
ఫ్రీ బేసిక్స్‌కు ట్రాయ్ రెడ్ సిగ్నెల్ వేసింది. దీనిపై ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. నెట్ న్యూట్రాలిటీకి పచ్చజెండా ఊపిన ట్రాయ్... ఫ్రీ బేసిక్స్ లాంటి వేర్వేరు టారిఫ్‌ల ఇంటర్నెట్‌‌కు ససేమిరా అంది. ఈ మేరకు స్పష్టమైన విధివిధానాలతో కూడా ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇలా ట్రాయ్ నిర్ణయం వెలువడిందో, లేదో... అటు మార్క్ జుకెర్ బర్గ్ వేగంగా స్పందించారు. ట్రాయ్ నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అయినప్పటికీ, నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకునే విషయంలో రాజీ పడబోనని ఆయన ప్రకటించారు. బహుళ ప్రయోజనాలున్న 'ఇంటర్నెట్. ఆర్గ్'ను ఒక్క భారతదేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందేలా చేయడమే తన కర్తవ్యమన్నారు. 
 
కాగా, 'ఫ్రీ బేసిక్స్' పేరిట భారత ఇంటర్నెట్ వినియోగదారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు తాను కుట్ర పన్నలేదని చెప్పుకొచ్చారు. ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ చేసిన యత్నాలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సోమవారం బ్రేకులు వేసిన విషయంతెల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments