Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం ఇవ్వలేదు... ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం చేసిందో వీడియోలో చూడండి..

థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (16:07 IST)
థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌, పెట్చబన్ ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో పెంచబడుతున్న ఎలుగుబంటికి ఆ ఆలయానికి వచ్చే వారు ఆహారం ఇస్తుంటారు. ఎలుగుబంటి కంటూ ఓ ప్రత్యేక భవనం ఉంది. అలా ఆ గుడికి వచ్చిన ఓ స్నేహితుల బృందం ఆ ఎలుగుబంటికి ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ బృందంలోని నైపుమ్ ప్రోమరేట్ అనే వ్యక్తి ఒక తాడు ద్వారా ఆహారాన్ని ఎలుగబంటికి ఇవ్వజూపాడు. 
 
అయితే ఎలుగుబంటికి ఆహారం ఇవ్వకుండా తాడును వదులుతూ.. ఎత్తుతూ ఏమార్చాడు. దీంతో ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది. అంతే కాంపౌండ్ పైకెక్కి.. ఆ యువకుడిని తన గూడులోకి లాక్కుని తీవ్రంగా గాయపరిచింది. ఆ ఎలుగుబంటి నుంచి చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు మిగిలిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఆపై ఆలయ అధికారులు ఎలుగుబంటి గూడులోకి ప్రవేశించి.. ఆ వ్యక్తిని కాపాడారు. అప్పటికే తీవ్రగాయాలపాలైన నైపుమ్‌ను ఆస్పత్రికి తరలించారు. నైపుమ్‌కు ప్రాణాపాయం లేదని అతనికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూడండి.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments