Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ఠాగూర్
బుధవారం, 6 ఆగస్టు 2025 (08:56 IST)
అప్పుల బాధతో ఒక వ్యక్తి ముగ్గురు బాలికలను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నామక్కల్ జిల్లాలోని రాశిపురం సమీపంలోని వెప్పంగవుందన్ పుత్తూర్ గ్రామంలోలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన గోవిందరాజ్ (36) అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వ్యవసాయం కూడా చేస్తున్నాడు. అతని భార్య భారతి (26), కుమార్తెలు ప్రకృతిశ్రీ (10), రిత్తికశ్రీ (7), దేవిశ్రీ (6), కుమారుడు ఆగ్నెస్ వరన్ (1) ఉన్నారు.
 
ఈ పరిస్థితిలో, సోమవారం రాత్రి ముగ్గురు బాలికలు గోవిందరాజ్‌తో పడుకున్నారు. భారతి అగ్నేశ్వరన్‌తో కలిసి మరొక గదిలో పడుకుంది. మంగళవారం ఉదయం పిల్లల అరుపులు విని ఆమె భయపడి మేల్కొని గది నుండి బయటకు రావడానికి ప్రయత్నించింది. అయితే, గది తలుపు బయటి నుండి లాక్ చేసి వున్నాయి. ఆమె తలుపు పగలగొట్టి బయటకు వచ్చేసరికి, ముగ్గురు పిల్లలు గొంతులు కోసి హత్య చేసి కనిపించారు. వారి పక్కనే గోవిందరాజ్ నోటి నుండి నురగలు కారుతూ చనిపోయివున్నాడు. 
 
దీనిప సమాచారం అందుకున్న మంగళపురం పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో రూ.20 లక్షల అప్పు చెల్లించలేకపోవడంతో నిరాశ చెందిన గోవిందరాజ్ బాలికలను చంపి, ఆపై విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై మంగళపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments