Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ కూర వండలేదని.. భార్య గొంతుకోసిన భర్త.. ఎక్కడ?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై గృహ హింసల నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మహిళలపై దాడులు, హత్యలు జరిగిపోతున్నాయి. తాజాగా చికెన్ వండటం ఆలస్యమైందని ఓ భర్త భార్య గొంతు కో

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (13:10 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై గృహ హింసల నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మహిళలపై దాడులు, హత్యలు జరిగిపోతున్నాయి. తాజాగా చికెన్ వండటం ఆలస్యమైందని ఓ భర్త భార్య గొంతు కోసేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  శివమొగ్గ నగరంలో సురేష్, ఆశారాణి(33) దంపతులు నివాసముంటున్నారు. 
 
మద్యానికి బానిసైన ఆశారాణి భర్త సోమవారం చికెన్ తీసుకుని వచ్చి వండమని భార్యకు చెప్పాడు. అప్పటికే సురేష్ మద్యం మత్తులో ఉన్నాడు. తిరిగి వచ్చి చూసేసరికి చికెన్ వండడం లేటు అయ్యింది. అంతే కోపంతో ఊగిపోయిన అతడు భార్య గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆశారాణి చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేష్‌ను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments