Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలాకు అరుదైన గౌరవం.. ఐరాస శాంతి దూతగా ఎంపిక..

నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస స

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (16:07 IST)
నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంపై మలాలా దృష్టి సారించారని.. అందుకే ప్రపంచ పౌరునికి ఐరాస సెక్రటరీ జనరల్ అందజేసే అత్యున్నత గౌరవాన్ని మలాలాకు అందజేసినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టెఫానీ డుజరిక్ పేర్కొన్నారు. సోమవారం జరిగే కార్యక్రమంలో మలాలాకు ఈ పదవిని అధికారికంగా కట్టబెట్టనున్నారు. 
 
వాయవ్య పాకిస్థాన్‌లో బాలబాలికలందరికీ విద్యా హక్కును అమలు చేయాలంటూ పోరాడుతున్న మలాలాపై గతంలో తాలిబన్ ఉగ్రవాదులు హత్యా యత్నం చేసినా.. అలాంటి భయానక పరిస్థితిలో కూడా ఆమె మహిళలు, బాలికలు, ప్రజల హక్కుల పట్ల నిబద్ధత కనబరచడంతో ఈ అరుదైన ఉన్నత గౌరవం ఆమెకు దక్కిందని తెలిపారు. తద్వారా అతి చిన్న వయస్సులో ఈ అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా మలాలా రికార్డు సాధించింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments