Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారీ భూకంపం - తీవ్రత 7.3గా నమోదు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:34 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున సుమత్రా దీవుల్లో ఇది సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపంతో ప్రజలు భయంతో భయభ్రాంతులైపోయారు. 
 
ఈ భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత సునామీ హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు. 
 
కాగా, భూకంప కేంద్రాన్ని భూమికి అడుగు భాగంలో 84 కిలోమీటర్ల లోతున గుర్తించారు. ఇది స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్టు ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది. ఆ తర్వాత కూడా పలు ప్రకంపనలు నమోదయ్యాయి. ఇందులో ఒకదాని తీవ్రత 5గా రికార్డయింది. 
 
పశ్చిమ సుమత్రా రాజధాని పెడాంగ్‌ను భూకంపం కుదిపేసిందని, భయంతో చాలామంది తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం సంభవించలేదన్నారు. 
 
కాగా, భూకంపంతో భయపడిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలపై వెళ్తుండగా, మరికొందరు నడిచే వెళ్తున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. సిబెరుట్ దీవిని ప్రజలు ఇప్పటికే ఖాళీ చేశారు. సునామీ హెచ్చకలు ఎత్తివేసిన తర్వాతే వస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments