Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. డొనాల్డ్ ట్రంప్‌కు నేను చేతబడి చేశాను.. ట్రంప్ ఫోటో, కొవ్వొత్తులు, ఉప్పుతో?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాను చేతబడి చేసినట్లు ప్రముఖ గాయని లానా డెల్ రే సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా వున్న ట్రంప్ ప్రవర్తనపై పలు దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్త

Webdunia
సోమవారం, 24 జులై 2017 (15:25 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాను చేతబడి చేసినట్లు ప్రముఖ గాయని లానా డెల్ రే సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా వున్న ట్రంప్ ప్రవర్తనపై పలు దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాపై అతని విధానాలు, ఇతర దేశాలపై ట్రంప్ చూపెడుతున్న వ్యతిరేకతపై ఇతర  దేశాలు మండిపడుతున్నాయి. ఫలితంగా పలువురు ప్రముఖులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా పాప్ గాయని లానా.. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌కు తాను చేతబడి చేసినట్లు కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. 
 
ట్రంప్‌కు చేతబడి చేశాను. ఎందుకు చేయకూడదు? ఇంకా ఎన్నో చేశాను. మనసులో తోచే ఆలోచనలకు బలం ఎక్కువని నేను నమ్ముతాను. ఒక విషయం జరగాలని అనుకున్నప్పుడు సానుకూల దృక్పథం.. దానిపై పట్టుదలను పెంచుతుంది. అదే మాటలుగా మారుతుంది. దాన్నే కార్యాచరణగా మార్చేస్తాం. చివర్లో కార్యసాధన జరిగిపోతుందని లానా డెల్ రే వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ ఫోటో, తెలుపు కొవ్వుత్తులు, నీరు, ఉప్పుతో బ్లాక్ మ్యాజిక్ చేశానని అమ్మడు చెప్పేసింది. ప్రస్తుతం లానా డెల్ రే వ్యాఖ్యలు అమెరికా సంచలనం సృష్టిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments